నల్గొండ

రుణ పంపిణీ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 10: రైతులు, పేదలకు అందించాల్సిన రుణాల పంపిణీని వేగవంతం చేసి వార్షిక లక్ష్యాలను పూర్తి చేసేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వివిధ రంగాలకు 2873.65 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా 2265.81 కోట్లు మాత్రమే పంపిణీ చేసి 78.85 శాతం లక్ష్యాన్ని సాధించారన్నారు. వ్యవసాయ రుణాలు ఖరీఫ్ సీజన్‌లో 773.49 కోట్లకు గాను 642.53 కోట్లు మాత్రమే ఇచ్చారని రబీలో 436.13 కోట్లకు గాను 266.21 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. అగ్రికల్చర్ టర్మినల్స్ 198.74 కోట్లకు గాను 137.96 కోట్లు మంజూరు చేశారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 134.68 కోట్లకుగాను 93.04 కోట్లు పంపిణీ చేశారన్నారు. కార్పోరేషన్ల ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలు సైతం పంపిణీ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయన్నారు. లబ్దిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వెంటనే రుణపంపిణీ చేయాలన్నారు. రుణ మాఫీ నిధులను రైతుల ఖాతాలోకి బదలాయించాలని, పెండింగ్‌లో పెట్టరాదని తెలిపారు. ముద్ర రుణాలకు 11422 మందికి గాను 10088 మందికి మాత్రమే 88.38 కోట్లు ఇచ్చారని మరింత మందికి ముద్ర రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు విరివిగా అందించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. ఆదర్శగ్రామం చింతకుంట్లలో ఎస్‌బిహెచ్ బ్రాంచ్‌ను ప్రారంభించాలని కోరారు. ఈ నెల 20 వరకు రైతులు పంట రుణాలను విడుదల చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ పైలట్‌గా ఎంపిక చేసిన 11 గ్రామాల్లో నూరుశాతం నగదు రహిత లావాదేవీల నిర్వహణకు బ్యాంకర్లు అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా నాబార్డు ప్రొటెన్షియల్ క్రెడిట్‌ప్లాన్ 38.15 కోట్ల రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈసమావేశంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, లీడ్‌బ్యాంకు మేనేజర్ సూర్యం, డిఆర్‌డిఒ అంజయ్య, నాబార్డు ఎజిఎం దయామృత, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

హరితహారంలో జిల్లా ఆదర్శంగా నిలవాలి
* గ్రీన్‌డే ప్రారంభంలో కలెక్టర్ సురేంద్రమోహన్

సూర్యాపేట, ఫిబ్రవరి 10: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న హరితహారంలో సూర్యాపేట జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకే గ్రీన్‌డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రం సమాపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నాటిన మొక్కలకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపకల్పనే గ్రీన్‌డే అని చెప్పారు. జిల్లాలో నాటిన ప్రతి మొక్కలను సంరక్షించడంతో పాటు అన్ని వర్గాలను హరితహారంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో గ్రీన్‌డేకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. హరితహారంలో నాటిని మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో మరో మొక్కను నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాలు, ఆసుపత్రులు, రహదారులు, ఇండ్ల ముందు నాటిన మొక్కలను సంరక్షించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారు భాగస్వామ్యులతున్నారన్నారు. రాబోయే వేసవికాలంలో మొక్కలకు నీరుపోసి సంరక్షించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాను వనాల కోటగా తీర్చిదిద్దే నినాదంతో ప్రతి మండలం, గ్రామంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 10వేల మందిని భాగస్వామ్యులు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వి డిగ్రీ కళాశాల వద్ద గల మున్సిపల్ పార్క్‌లో మున్సిపల్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన గ్రీన్‌డే పనులను పరిశీలించారు. ఆ తర్వాత 8వ వార్డు భగత్‌సింగ్‌నగర్‌లో పర్యటించి మహిళలు, విద్యార్థులతో మొక్కలు నాటించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్, ఎఫ్‌ఆర్‌వో వెంకటేశ్వర్‌రావు, ఎంపిడివో నాగిరెడ్డి, టిపివో వసుందరదేవితో పాటు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.