నల్గొండ

అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఫిబ్రవరి 18: గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి ఉత్తమ్‌రెడ్డి అన్నారు. కోదాడ మండల పరిషత్ సర్వసభ్యసమావేశం శనివారం మండలపరిషత్ కార్యాలయంలో యంపిపి అద్యక్షురాలు డేగ రాణి అద్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నుండి అధిక నిధులు కేటాయింపులు జరిగేవిధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి మ్యాప్‌ను తయారుచేయాలని, 90 రోజుల తరువాత నిర్వహించే తదుపరి సమావేశంలో ఆ మ్యాప్‌ను సభలో ప్రదర్శించాలని అధికారులను ఆమె కోరారు. ప్రభుత్వ భూములను గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలోకి వెళుతున్నాయని ఆమె చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తెస్తే పార్టీలకు అతీతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హమీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కేటాయించాలని గోండ్రియాల యంపిటిసి నెల్లూరి వీరభద్రరావును ఎమ్మెల్యే పద్మావతిని కోరడంతో తెరాస, కాంగ్రెస్ సభ్యుల మద్య కొద్దిసేపువాగ్వాదం జరిగింది. తదుపరి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి స్పందిస్తూ ప్రజాప్రతినిధులంటే తనకు గౌరవమని, సిడిసి నిధులను గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల ద్వారా రాజకీయాలకు అతీతంగా కేటాయించేందుకు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హమీ ఇచ్చారు.
అధికారులు పనితీరును మార్చుకోవాలి:
మార్కెట్ ఛైర్మన్ శశిధర్‌రెడ్డి
అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని, ప్రజాప్రతినిధులంటే అధికారులు కనీస గౌరవం ఇవ్వడంలేదని, పరిస్ధితి మారకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని కోదాడ వ్యవసాయమార్కెట్ ఛైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. కోదాడ మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ సమావేశాలకు చాలా ప్రభుత్వశాఖల అధికారులు హాజరుగాకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కోదాడ ప్రధానరహదారి ఆక్రమణలను తొలగించేందుకు తాను సహకరిస్తానని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని టేలాండ్‌కు నీరందించేందుకు పాలేరువాగుపై ఐదు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వస్ధలాలు వుంటే డబల్‌బెడ్ రూమ్ ఇండ్లను మంజూరీ చేయిస్తానని శశిధర్‌రెడ్డి హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెరాస యంపిటిసి సభ్యులు మార్కెట్ ఛైర్మన్ శశిధర్‌రెడ్డిని సన్మానించారు. ప్రభుత్వం మంజూరుచేసిన నిర్మాణాలకు సంబందించి ఇసుక అనుమతులు ఇవ్వకుండా రెవిన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సర్పంచ్ సంపెట రవి ఆరోపించారు. సాగర్ నీటిని పాలేరువాగులోకి విడుదల చేయించి గోండ్రియాల, చిమిర్యాల, కొత్తగూడెం, నల్లబండగూడెం, మంగలితండ, రెడ్లకుంట గ్రామాల పరిధిలో ఎండుతున్న పంటలను కాపాడాలని యంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు ఎమ్మెల్యే, మార్కెట్ ఛైర్మన్‌కు సమావేశంలో వినతిపత్రాన్ని అందించారు. సమావేశంలో జడ్‌పిటిసి సభ్యురాలు ధనలక్ష్మి, యంపిపి ఉపాద్యక్షులు మందలపుశేషు, డిసిసిబి డైరెక్టర్ డేగ బాబు, తాహాశీల్దార్ వందనపుశ్రీదేవి, యండివో ప్రేమకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.