నల్గొండ

కొత్తగా 1800 బస్సుల కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు గాను సుమారు 1800 నూతనంగా బస్సులను కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి) జి సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ డిపో, బస్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. తొలుత కార్మికుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పని ఇంకా మెరుగు పర్చి లాభాల బాటలో నడపాలని డ్రైవర్లు, కండక్టర్లను ఆయన కోరారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ విభజన అనంతరం రూ.540 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉండేనని గత జనవరి వరకు దానిని రూ.500 కోట్ల వరకు తగ్గించగలిగామన్నారు. ఒక్క నల్లగొండ రీజియన్ నుండే సుమారు 19 కోట్ల నష్టాన్ని తగ్గించగలిగామని, రాష్ట్రంలో నష్టాలు తగ్గించడంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. నల్లగొండ రీజియన్‌కు ఇంద్ర, లగ్జరీ, సెమీ లగ్జరీ, డీలక్స్, పల్లె వెలుగు బస్సులు సుమారు 80 వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. క్యాట్, వనిత, మంత్లీ సీజన్ టికెట్ల గురించి విస్తృత ప్రచారం జరిపేందుకు గాను రాష్టవ్య్రాప్తంగా కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సుమారు 1.2 లక్షల క్యాట్, వనిత, ఎంఎస్‌టిలున్నాయని ఇంకా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎం.విజయ్‌కుమార్, డివిజనల్ మేనేజర్ మధుసుధన్‌రావు, డిపో మేనేజర్ సుధాకర్‌రావు, ఎఎం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంఎఫ్ చంద్రశేఖర్, ఉద్యోగులు పాండురంగయ్య, మజహరుద్దీన్, యాదిగిరి ఉన్నారు.

పాఠశాలల్లో కరాటే తప్పనిసరి
* ప్రముఖ సినీ నటుడు భానుచందర్
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 20: పాఠశాలలు, కళాశాలల్లో కరాటేను తప్పని సరిగా అమలు చేయాలని ప్రముఖ సినీనటుడు, కరాటే మాస్టర్ భానుచందర్ కోరారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో కరాటే నేర్పాలని జిఓ జారీ చేసిన అమలు చేయడం లేదని, వెంటనే అమలుకై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి చెడు దారుల్లో వెళ్లరని ఆయన అన్నారు. మార్షల్ ఆర్ట్స్ అయిన కరాటే, జూడో, చుటురాయి, షోటోకాన్‌లు ఒలింపిక్‌లో గుర్తింపు పొందాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి వెంటనే పాఠ్యాంశాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను చేర్చాలని కోరారు. నేటి సినిమాల్లో గ్రాఫిక్స్ అధికంగా ఉండటం వల్ల నేటి తరానికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. వాస్తవంగా చలనచిత్రాలు ఉండాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు సుమారు 160 తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో పని చేశానని, తన కుమారుడు నేడు తెరపైకి వస్తున్నాడని ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో మాజీ జడ్పిటిసి దోసపాటి శ్రీనివాస్, కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద సైదులు, లయన్స్ రీజియన్ చైర్మన్ పందిర్ల పద్మావతి, ధనలక్ష్మి, రామకృష్ణ, బి.వెంకన్నగౌడ్‌లున్నారు.

నేడు మంత్రి
జోగు రామన్న రాక
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 20: రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగురామన్న నేడు జిల్లాలో పర్యటించనున్నారు. నార్కట్‌పల్లి మండల ఏనుగులదోరె, గోపలయాపల్లి, నకిరేకల్, నల్లగొండ మండలం చిన్నసూరారం హరితహారం నర్సరీలను మంత్రి పరిశీలిస్తారు. 3 గంటలకు నల్లగొండ పట్టణంలోని అటవీశాఖ నందనవంనం పార్కులో సైకిల్‌ట్రాక్‌ను ప్రారంభించి అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.