నల్గొండ

కెసిఆర్‌ది నిరంకుశపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంకుశపాలనను సాగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని జెఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని దుయ్య బట్టారు. రైతులకు రుణమాఫీని ఏకకాలంలో చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందరికి విద్య, వైద్యం ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చా హామీలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, బిసి కులాలకు చెందిన వారు 92 శాతం మంది ఉన్నారని, కాని జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో వారి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంలేదని, కేటాయించిన నిధులను కూడా ఖర్చుచేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. మైనార్టీలకు, ఎస్‌టిలకు 12శాతం రిజర్వేషన్లు హామీ ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందాలంటే పేద ప్రజల సమస్యలు పరిష్కారమైనప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణాలో అందరికి న్యాయం జరిగే దోపిడీ లేని పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు డబ్బికార్ మల్లేష్, మల్లుగౌతంరెడ్డి, జగదీశ్ఛంద్ర, మహ్మద్‌బిన్‌సయిద్ తదితరులు ఉన్నారు.

పాఠశాలల్లో కరాటే తప్పనిసరిగా పెట్టాలి
* ప్రముఖ సినీ నటుడు భానుచందర్
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 20: పాఠశాలలు, కళాశాలల్లో కరాటేను తప్పని సరిగా అమలు చేయాలని ప్రముఖ సినీనటుడు, కరాటే మాస్టర్ భానుచందర్ కోరారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో కరాటే నేర్పాలని జిఓ జారీ చేసిన అమలు చేయడం లేదని, వెంటనే అమలుకై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి చెడు దారుల్లో వెళ్లరని ఆయన అన్నారు. మార్షల్ ఆర్ట్స్ అయిన కరాటే, జూడో, చుటురాయి, షోటోకాన్‌లు ఒలింపిక్‌లో గుర్తింపు పొందాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి వెంటనే పాఠ్యాంశాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను చేర్చాలని కోరారు. నేటి సినిమాల్లో గ్రాఫిక్స్ అధికంగా ఉండటం వల్ల నేటి తరానికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. వాస్తవంగా చలనచిత్రాలు ఉండాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు సుమారు 160 తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో పని చేశానని, తన కుమారుడు నేడు తెరపైకి వస్తున్నాడని ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో మాజీ జడ్పిటిసి దోసపాటి శ్రీనివాస్, కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద సైదులు, లయన్స్ రీజియన్ చైర్మన్ పందిర్ల పద్మావతి, ధనలక్ష్మి, రామకృష్ణ, బి.వెంకన్నగౌడ్‌లున్నారు.

కులవృత్తుల సంక్షేమానికే జనహిత
* నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి
గుర్రంపోడ్, ఫిబ్రవరి 20: కులవృత్తుల సంక్షేమం కొరకే ముఖ్యమంత్రి కెసిఆర్ జనహిత కార్యక్రమం ప్రారంభించారని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌బిసి కాలనీలో నిర్వహించిన కులవృత్తిదారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ బంగారు తెలంగాణ లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారని, అందుకు గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయటంలోనే ఉందన్నారు. కెసిఆర్ అన్ని కులాలకు చెందిన కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కులవృత్తులకు పెద్దపీట వేశారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపూర్ణంగా బలోపేతం చేసేందుకు కెసిఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారనడానికి మత్య్సకారులకు 40 లక్షల చేపపిల్లలను చెరువులో వేయడమే నిదర్శనమన్నారు. యాదవులకు 4 లక్షల కుటుంబాలకు కుటుంబానికి 1 లక్ష 25 వేల చొప్పున 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలను అందిస్తున్నారన్నారు. నియోజకవర్గానికి 1400 ఇండ్ల చొప్పున ప్రతి కుటుంబానికి 5 లక్షల 6 వేలతో రానున్న రెండేళ్లలో 2 లక్షల ఇళ్లు నిర్మిస్తారన్నారు. డిండి, అక్కంపల్లి రిజర్వాయర్ ద్వారా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి నోముల నర్సింహాయ్య, టిఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రఘుమారెడ్డి, బల్గూరి నగేష్, ఎంపిపి తేరా జోజి రెడ్డి, జడ్పీటిసి రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు.