నల్గొండ

చేనులో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడ్, ఫిబ్రవరి 21: నిప్పు అంటుకొని రైతు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వట్టికోడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కత్తి పాపారెడ్డి(75) తనకున్న వ్యవసాయ భూమిలో కందికట్టెను కాల్చే సమయంలో నిప్పులు చెలరేగి అతనికి అంటుకోవడంతోపూర్తిగా కాలిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్రకటనలకు, సమీక్షలకే పరిమితమైన పథకాలు
* సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
చిట్యాల, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాల్సిందిపోయి కేవలం ప్రకటనలకు సమీక్షలకే పరిమితమైనదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం జరిగిన పార్టీ మండల జనరల్‌బాడీ సమావేశానికి ముఖ్యఅతిధిగా చెరుపల్లి సీతారాములు హాజరై మాట్లాడారు. ప్రజలకు కావాల్సింది ప్రకటనలు, సమీక్షలు కాదని చేసిన ప్రకటనల సంక్షేమ ఫలాలు కావాలని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. నారబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు మామిడి సర్వయ్య, బోళ్ళ నర్సింహారెడ్డి, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య నాయకులు జిట్ట నగేష్, పామనగుళ్ళ అచ్చాలు, గాలి నర్సింహ, ఎస్‌ఆర్ వెంకటేశ్వర్లు, శీలా రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

సాదాబైనామా సర్ట్ఫికేట్ రైతులకు రుణాలు ఇవ్వాలి
- బ్యాంకర్‌లకు కలెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశం
కోదాడ, ఫిబ్రవరి 21: సాదాబైనామాల సర్ట్ఫికేట్ 13-బి ఫారం వున్న రైతులకు బ్యాంకర్లు పంటరుణాలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ బ్యాంకర్‌లను ఆదేశించారు. కోదాడ మండలపరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన జెఎంఎల్‌బిసి సమావేశంలో కలెక్టర్ సురేంద్రమోహన్ పాల్గొని ప్రసంగించారు. సాదాబైనామా 13-బి ఫారం వున్న రైతుకు భూమిపై హక్కు వుంటుందని, బ్యాంకర్లు ఇబ్బంది పెట్టకుండా వారికి పంటరుణాలు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో పంట రుణాల లక్ష్యం 300 కోట్లు కాగా ఇప్పటివరకు బ్యాంకర్లు 195 కోట్లు మాత్రమే ఇచ్చారని తక్కిన 105 కోట్లను మార్చి 31వరకు రైతులకు పంపిణీ చేయాలని కోరారు. పంట రుణాల లక్ష్యం పూర్తిచేసిన బ్యాంకులకు డిపాజిట్‌లను ఇచ్చి చేయూతను ఇస్తామని ప్రకటించారు. కోదాడ స్టేట్ బ్యాంక్ హైద్రాబాద్ శాఖ 60 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు 20 లక్షలను బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. బ్యాంకర్లు, అధికారులు వాట్సప్ గ్రూపుగా ఏర్పడి తనను కలుపుకోవాలని, కార్యక్రమాల సమాచారాన్ని పరస్పరం వాట్సప్‌లో షేర్ చేసుకోవాలని సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు అందించే రుణాలు అన్ని గ్రౌండింగ్ చేయాలని కోరారు. అధికారులు, బ్యాంకర్లు క్షేత్రస్థాయికి వెళ్లి లబ్ధిదారునితో కలిసి యూనిట్ ముందు ఫొటో దిగి పంపాలన్నారు. సూర్యాపేట జిల్లా వ్యవసాయాధారిత జిల్లాగా వున్నందున బ్యాంకర్లు ఎక్కువగా రైతులకు పంటరుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ సురేంద్రమోహన్ కోరారు. కార్యక్రమంలో జెఎంఎల్‌బిసి కన్వీనర్ జూలూరి శ్రీ్ధర్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ జి.సూర్యం, డిఆర్‌డిఎ ప్రాజెక్ట్ అధికారి కిరణ్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.జ్యోతిర్మయి, ఎస్‌బిహెచ్ నల్లగొండ మేనేజర్ సి.నాగేశ్వర్‌రావు, కోదాడ ఎడియే ఎల్లయ్య, కోదాడ ఎండివో ప్రేమకరణ్‌రెడ్డి, వివిద మండలాల తహశీల్దార్‌లు వందనపుశ్రీదేవి, ఇవి రమణారావు, కార్తీక్, మున్సిపల్ కమిషనర్ కందుల అమరేందర్‌రెడ్డి, బ్యాంకు అధికారులు, పాల్గొన్నారు.