నల్గొండ

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, ఫిబ్రవరి 24: మండలంలోని దాచారంలో బాల్య వివాహాన్ని పోలీసులు, అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన కోటయ్య తన మైనర్ కుమార్తెకు అనంతారం గ్రామానికి చెందిన ఓ యువకునితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. కోటయ్య కూతురు మైనర్ కావడంతో సమాచారం అందుకున్న ఎఎస్‌ఐ సాయినాథ్, వీఆర్‌వో గ్రామానికి చేరుకొని బాల్య వివాహంపై తల్లిదండ్రులతో విచారించారు. అమ్మాయి వయస్సు 17 ఏళ్లు ఉన్నందున వివాహం చేయకూడదని, చట్టరీత్యా నేరమని తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని ఆపివేయించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త నర్మద్, వీఆర్‌ఎ శ్రీను, తదితరులున్నారు.

ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత: ఎంపి బూర
భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 24: ఆధ్మాత్మికతోనే మానసిక ప్రశాంత లభిస్తుందని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ నల్ల వీరభద్రేశ్వర స్వామి దేవాలయం, శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 101 యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్‌ను శాలువ, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిపి సార సరస్వతి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, కోట మల్లారెడ్డి, భారత వాసుదేవు, రావుల శేఖర్ రెడ్డి, చక్రపాణి, రామాంజనేయులు, చంద్రం యాదవ్, బాలనర్సింహ్మా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రభుత్వ విప్ రాక
రాజాపేట, ఫిబ్రవరి 24: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి శనివారం రానున్నట్లు ఎంపిపి పులి సత్యనారాయణ, జడ్పీటిసి రాజిరెడ్డి, మండల టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, సందుల భాస్కర్ గౌడ్, సోమలింగం గుప్తలు తెలిపారు.