నల్గొండ

మహాజన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో సామాజిక తెలంగాణకై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న మహాజన పాదయాత్రకు, సామాజిక తెలంగాణ ఏజెండాకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం తమ్మినేని వీరభద్రం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు హుజూర్‌నగర్‌లో ఘనస్వాగతం చెప్పారు. అనంతరం పట్టణంలోని మెయిన్ రోడ్డుపై జరిగిన బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పాదయాత్రకు అభినందనలు చెపుతున్నట్లు తెలిపారు. తాను మొదటి నుండి కమ్యూనిస్టు అభిమానినని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో, నిజాం రాజరిక వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేమన్నారు. యుపిఏ ప్రభుత్వ కాలంలో ప్రపంచం అంతటా ఆర్థిక సంక్షోభం ఎదురైన భారత్‌లో మాత్రం వామపక్షాల వల్ల సంక్షోభం ఏర్పడలేదని అన్నారు. తాను మంత్రిగా ఉన్నపుడు పట్టణంలో దేవాదాయ శాఖ నుండి 112 ఎకరాల భూమి సేకరించి గృహనిర్మాణ శాఖకు అప్పగించి పేదలకు 4వేల గృహాల నిర్మాణం చేపట్టామని టిఆర్‌యస్ ప్రభుత్వం వాటిని నిలిపివేసి కాలయాపన ఎందుకు చేస్తున్నదో అవగతం కావటం లేదన్నారు. 2004 నుండి 14 వరకు నాగార్జుసాగర్ ఎడమ కాలువ కింద రెండు పంటలకు నీరు ఇవ్వగా ప్రస్తుతం గత 3 సంవత్సరాలలో ఒక్క పంటకు నీరు సరఫరా చేయలేదని అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదని, ఆరోగ్యశ్రీ అమలు లేదని, ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంచలేదని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వలేదని, 1లక్షా 35 వేల ఉద్యోగాలకు కేవలం 5 వేలు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా గత 3 సంవత్సరాలలో డిఎస్సీ నిర్వహించలేదని, ఇందిరమ్మ గృహాల బిల్లులు చెల్లించలేదని 119 నియోజకవర్గాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు.

క్షతగాత్రులకు ఎమ్మెల్యే వీరేశం పరామర్శ
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 24: విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం లారీని వెనుక నుండి వెళ్లి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పరమార్శించారు. ప్రమాదంలో చికత్స పొందుతు నలుగురు చనిపోయారు. వారి మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బస్సు ప్రయాణికులు 20మందికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు ఎమ్మెల్యే వీరేశం, చిరుమర్తిలు సూచించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నుండి ఎక్స్‌గ్రేషియా అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సత్తయ్యయాదవ్, ఎంపిపి మల్లిఖార్జున్‌రెడ్డి, ఎంపిటీసి యాదయ్య, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రహీంఖాన్ తదితరులు ఉన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రామన్నపేట, ఫిబ్రవరి 24: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుబ్బాక గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చిరెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం సామ నర్సిరెడ్డి (40) తనకుఉన్న ఐదు ఎకరాలతో పాటు మరో ఇద్దరు రైతులకు చెందిన పదిఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఏడు ఎకరాలలో పత్తి, మూడు ఎకరాలలో కంది, ఐదు ఎకరాలలో వరిపంట సాగుచేశాడు. పత్తి, కందిపంటలకోసం వేలాదిరూపాయలు పెట్టుబడిపెట్టిన దిగుమతి సక్రమంగా రాకపోవడంతో పాత అప్పులతోపాటు మరిన్ని అప్పులు పెరిగాయి. అప్పులతోపాటు వడ్డీలు పెరిగిపోతుండటంతో మానసికంగా కుంగిపోయి ఈనెల 18న తన వరిపొలం వద్ద గుళికల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, ఇరుకుపొరుగు రైతులకు సమాచారం అందడంతో ముందుగా రామన్నపేట ఆసుపత్రికి తీసుకవచ్చారు. వైద్యుల సలహామేరకు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. గతవారం రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని భార్య మంజుల ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు.