నల్గొండ

కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు, రైతులు పెట్టుకున్న ఆశలను నీరుగారుస్తు నియంతృత్వ పాలన సాగిస్తున్న సీఎం కెసిఆర్‌కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చేప్పేందుకు ప్రజలు సంసిద్ధం కావాలని సిఎల్పీ నేత, స్థానిక నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనావేధన సమ్మేళన సభలో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు సమృద్ధిగా లభిస్తాయన్న ఆశతో రాష్ట్ర సాధనకు పోరాడిన ప్రజలు, యువకులు, రైతుల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నేటికి సంపూర్ణంగా నేరవేర్చకుండా మాటలతో కాలం వెళ్లదీస్తుందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన టి.జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను అప్రజాస్వామికంగా అక్రమంగా అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. నిరహార దీక్షలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా పార్టీ అధిష్టానం వద్ధ పోరాడి తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చేలా కృషి చేశారన్నారు. 2019ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి ప్రజలు బహుమతి అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా 25లక్షల ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మినహా రాష్ట్రంలో ఎక్కడా కూడా డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవగాహాన రాహిత్యంతో పెద్దనోట్ల రద్ధు చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామని ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు వేస్తామన్న మోదీ ప్రభుత్వం నోట్ల రద్ధుతో దొరికిన నల్లధనం లెక్కలే బయటపెట్టలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ అమలును కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 35ఏళ్ల పాలనలో 60వేల కోట్ల అప్పు చేస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్ల కాలంలోనే 60వేల కోట్ల అప్పు చేసిందన్నారు. మూడేళ్లలో కెసిఆర్ ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కాలేదన్నారు. నేడు యాదవులకు 40లక్షల యూనిట్ల గొర్రె పిల్లలు ఇస్తామన్న కెసిఆర్ ప్రకటన సైతం నేరవేరుతుందా అంటు ఎద్దేవా చేశారు. మత్స్యకార్మికులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేపట్టిన ప్రభుత్వం చెరువుల్లో నీళ్లు ఉన్నాయ లేదా అన్న సంగతి విస్మరించిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయంబర్స్‌మెంట్లను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం ఇవ్వకపోవడంతో యువత ఆందోళనల బాట పడుతుందన్నారు. రైతుల రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీలను సక్రమంగా అందించలేదన్నారు. 40ఏళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తాను అభివృద్ధి చేశానన్నారు. మాటలతో కాలం గడుపుతున్న ప్రభుత్వ పార్టీ నాయకులు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ఇన్నాళ్లుగా తనను ఆదరించిన ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాల చిన సత్తయ్య యాదవ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాములు, కాంగ్రెస్ నాయకులు సుదిని జగదీశ్వర్‌రెడ్డి, అమరేందర్‌గౌడ్, రాధకృష్ణ, చిన్నా, అశోక్‌రెడ్డి, సురేష్, కందుల రమేశ్, వెలుగు యాదయ్య, నర్సింహరావు తదితరుల పాల్గొన్నారు.