నల్గొండ

హరి ఓం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి వేడుకలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వైభవంగా సాగాయి. తెల్లవారుజామునుండే శివాలయాలకు భక్త జన ప్రవాహం కొనసాగగా రుద్రాభిషేకాలు, హోమాలు, బిల్వార్చనలతో శివనామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగాయి. శంభోశంకర హరహరమహాదేవ అంటు ఆదిదేవుడై మహాదేవుడు సాంబశివుడికి అభిషేక, అర్చనలు, దర్శనాల కోసం తరలివచ్చిన భక్తుల రద్ధీతో శివాలయాలు కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతులు శివపార్వతుల కల్యాణోత్సవాలు అంతటా కన్నుల పండువగా శైవసాంప్రదాయ రీతిలో ఘనంగా జరుపుకున్నారు. శివభక్తులు ఉపవాసాలు, జాగరణలతో ఇష్టదైవం మహాశివుడిని నిష్టతో పూజించారు. ఆలయాల్లో భక్తుల జాగరణల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోగా భక్తుల శివనామస్మరణలతో చెర్వుగట్టు కొండ మారుమ్రోగింది. స్థానిక నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డిలు స్వామివారి రుద్రాభిషేకం, అర్చనల్లో పాల్గొన్నారు. పానగల్ చారిత్రక ఛాయ, పచ్ఛల సోమేశ్వర ఆలయాలు, బ్రహ్మంగారిగుట్ట శివాలయం, తిప్పర్తి రామలింగేశ్వర ఆలయం, అప్పాజిపేట శివాలయాల్లో భక్తులు లింగాభిషేకాలు, అర్చనలకు బారులు తీరారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవిందర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జిల్లా జడ్జీలు ఎంఆర్. సునీత, శైలజా, సత్యనారాయణలు, దేవాదాయశాఖ ఏసి సులోచనలు పానగల్ సోమేశ్వర ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కృష్ణాతీరాన కొలువైన దామరచర్ల మండలం వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా సాగగా వేలాది మంది భక్తజనం మీనాక్షీ ఆగస్తేశ్వరుడి దర్శనం కోసం తరలివచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు అగస్తేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేరడుచర్ల బుగ్గమల్లిశ్వర ఆలయం, నాగార్జున సాగర్ ఏలేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు, పార్వతీపరమేశ్వరుల కల్యాణాలు నిర్వహించారు. సాగర్ నుండి ఏలేశ్వరుడి కొండకు చేరుకునేందుకు భక్తులకు ప్రత్యేక లాంఛీల వసతి కల్పించారు. దేవరకొండ చారిత్రాక శివాలయంలో, ముదిగొండ శివాలయంలో శివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్యదైవం చందంపేట దేవరచర్ల మల్లన్న చెంత శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. చండూర్, నాంపల్లి, చింతపల్లి, పిఏపల్లి శివాలయాల్లో శివరాత్రి ఉత్సవాలతో శైవ ఆలయాలు కళకళలాడాయి.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లా పరిధిలోని మేళ్లచెర్వు శంభులింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర పెద్ద ఎత్తున సాగింది. శంభులింగేశ్వరుడి శివరాత్రి పూజల్లో పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు పాల్గొని రుద్రాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చారిత్రాక పిల్లలమర్రి దేవాలయంలో, పెనపహడ్ నాగుల అన్నారం శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు భారీగా సాగాయి. హుజూర్‌నగర్, కోదాడ శివాలయాల్లో సైతం మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు భారీగా పూజలు, శివపార్వతుల కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపై శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల దర్శనానికి భక్తులు బారులు తీరారు. కొలనుపాక శివాలయం, ఆలేరు షర్భానపురం శివాలయం, భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వర ఆలయం, బీబీనగర్ లింగబసవేశ్వర ఆలయాల్లో, రాచకొండ, చౌటుప్పల్, సుంకిశాల, వలిగొండ, బొమ్మలరామారం, రామన్నపేట శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు.

సామాజిక బహిష్కరణపై గీత కార్మికుల నిరసన
* సర్పంచ్‌పై స్టేషన్‌లో ఫిర్యాదు
ఆత్మకూర్(ఎం), ఫిబ్రవరి 24: మండలంలోని కాటేపల్లి గ్రామంలో మద్యం బెల్ట్‌షాపుల వేలం పాటల్లో పాల్గొనలేదంటూ గ్రామ గౌడ కులస్తులను సామాజిక బహిష్కరణ చేయడంపై గౌడకులస్తులు( గీత కార్మికులు) శుక్రవారం సాయంత్రం కాటేపల్లి-్భవనగిరి రోడ్డుపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. అనంతరం ఇందుకు కారణమైన సర్పంచ్ భర్త నాగిరెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెల్ట్‌షాపుల వేలం పాటల్లో తాము పాల్గొనకపోవడంతో పంచాయతీకి ఆదాయం రావడం లేదంటు కక్ష పెంచుకుని తమను సామాజిక బహిష్కరణ చేస్తున్నట్లుగా డప్పు చాటింపు చేయించడని, ప్రభుత్వం వెంటనే సర్పంచ్ భర్తపై చట్టపర చర్యలు తీసుకోవాలని కాటేపల్లి గ్రామ గౌడకులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజుగౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి జయరాజుగౌడ్, సొసైటీ అధ్యక్షుడు పచ్చిమట్ల సోములు, ఎంపిటీసి మాదార్‌గౌడ్, గీతకార్మికులు మారయ్య, సత్తయ్య, వెంకటేశ్, అమరేందర్‌రెడ్డి, శ్రీను, సోమయ్య, రమేష్‌లు పాల్గొన్నారు.

గ్రీన్‌డే స్ఫూర్తిదాయకం
* మొక్కల సంరక్షణలో అందరు భాగస్వామ్యం కావాలి
* హరితహారం అమలులో పేట కలెక్టర్ పనితీరు భేష్
* సిఎం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్
సూర్యాపేట, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రికగా భావిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్ వినూత్నంగా చేపట్టిన గ్రీన్‌డే కార్యక్రమం ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ ప్రశంసించారు. గ్రీన్‌డే కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు శుక్రవారం ఆమె జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రం శివారులో జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను తొలుత ఆమె పరిశీలించారు. రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాటిన 91లక్షల మొక్కలను సంరక్షించే లక్ష్యంతో కలెక్టర్ సురేంద్రమోహన్ వినూత్నంగా గ్రీన్‌డే కార్యక్రమాన్ని అమలుచేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో అందరు ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి నాటిని మొక్కలంన్నిటిని సంరక్షించేలా సామాజిక బాధ్యతను తెలియజెప్పేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఇతర జిల్లాల కలెక్టర్‌లకు స్ఫూర్తినిస్తుందన్నారు. మే మాసం వరకు మొక్కలను సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వేసవిలో మొక్కలను సంరక్షించుకుంటే ఇక నాటిన మొక్కలన్ని వృక్షాలుగా ఎదుగుతాయన్నారు. మొక్కల సంరక్షణకు నీరు పోసే పనులకు ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారిపై నాటిన మొక్కలను పరిరక్షిస్తే పచ్చదనం పెరగడంతో పాటు రహదారిపై ప్రయాణించే వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఒక స్మతివనాన్ని ఏర్పాటుచేసి అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె మున్సిపాలిటీ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని ఏరియా ఆసుపత్రి పక్కన సైనిక్‌పురి పార్క్ వద్ద అభివృద్ధి చేస్తున్న పండ్ల మొక్కల ప్లాంటేషన్ నిర్వహణ బాగుందని ప్రశంసించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పి పరిమళతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సూర్యాపేట మండలపరిధిలోని గాంధీనగర్ గ్రామంలో డిఆర్‌డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లక్ష టేకుమొక్కల నర్సరీని ఆమె పరిశీలించారు. వల్లభాపురం వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలోనెలకొల్పిన నర్సరీలో పెంచుతున్న కర్జూర, ఈత, టేకుమొక్కలను పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని గోపాళపురం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, ఆర్డీవో మోహన్‌రావు, డిఎఫ్‌వో సునీల్, డిఆర్‌డివో కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రం శివారులోని పిల్లలమర్రి స్టేజి వద్ద కలెక్టర్ ఓఎస్‌డికి స్వాగతం పలికి జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలుతీరును వివరించారు.