నల్గొండ

చేనేతకు చేయూతపై కొత్త ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 25: వ్యవసాయ రంగం తర్వాత నిరంతర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగం అభివృద్ధిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడం చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోచంపల్లి, చండూర్, రామన్నపేట, మోత్కూర్, ఆత్మకూర్(ఎం), ఆలేరు, నల్లగొండ, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, తిప్పర్తి వంటి మండలాలు చేనేత వస్త్రాలకు ప్రఖ్యాతిగాంచాయి. ఉమ్మడి జిల్లాలో 82చేనేత సహకార సంఘాలు, 38వేల చేనేత మగ్గాలుండగా కాలక్రమేణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న చేనేత వృత్తితో కుటుంబాలు గడువలేని పరిస్థితుల్లో వేల కుటుంబాలు చేనేత వృత్తికి దూరమయ్యాయి. మరమగ్గాలు, పవర్‌లూమ్స్ సంప్రదాయ చేనేత మగ్గాల కార్మికులపై ఆధిపత్యం సాధించాయి. చేనేత రంగంలో వచ్చిన మార్పులు చేనేత కార్మికుల జీవితాల్లో మార్పులు తేలేకపోగా చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు సన్నగిల్లి దళారీల దోపిడీ అధికమై చేనేత కుటుంబాలు ఆర్థికంగా సంక్షోభంలో పడ్డాయి. 22వేలకు చేనేత మగ్గాలు పడిపోగా మరమగ్గాలు 1458ఉండగా చేనేత సంఘాలు 49కి పడిపోయాయి. మాస్టర్ వీవర్స్ దగ్గర పనిచేసే చేనేత కార్మికులే ఇప్పుడు అధికంగా ఉన్నారు.
కొత్త చేనేత క్లస్టర్లు, పథకాలు !
చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన చర్యల్లో చౌటుప్పల్, పోచంపల్లి, కుంట్లగూడెం, మోత్కూర్‌లకు ప్రత్యేక చేనేత క్లస్టర్ పథకం మంజూరు కోరుతు, కొత్త నూలు డిపోల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. మగ్గాల చేనేత కార్మికులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టి మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసి పథకాల లబ్ధి పక్కాగా కార్మికులకు అందించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అవసరమైన వస్త్రాలను చేనేత సంఘాలకు మాత్రమే అప్పగించి వారి నుండే కొనుగోలు చేయడం ద్వారా చేనేతకు బాసటగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోచంపల్లి చీరలకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు నేపథ్యంలో వాటి మార్కెట్‌ను విస్తరణకు సాంకేతికను వినియోగించి ఆధునిక డిజైన్లతో వాటి ఉత్పత్తిని ప్రొత్సహించి మార్కెటింగ్ విస్తరించేందుకు పథక రచన చేస్తున్నారు. అయితే నూలు, మల్బరీ పట్టును కేంద్రం అందిస్తున్న రాయితీకి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సబ్సిడీ భరించి కనీసంగా 50శాతం సబ్సిడీతో ముడిసరుకు అందించేలా మరిన్ని డిపోల ఏర్పాటును కార్మికులు కోరుతున్నారు.
ప్రస్తుతమున్న ఐదు చేనేత క్లస్టర్లను ఆధునీకరించాల్సివుంది. టెస్కో వస్త్రాల కొనుగోలు చెల్లింపుల్లో జాప్యం సమస్యగా మారింది. కార్మికుల నుండి తక్కువ ధరకు చేనేత వస్త్రాలు కొంటున్న సహకార సంఘాలు, టెస్కోలు రెండింతలు అధికంగా ధర పెంచివినియోగదారులకు విక్రయిస్తుండటంతో చేనేత వస్త్రాల గిరాకీని దెబ్బతీస్తున్నాయి. చేనేత ఉత్పత్తుల కొనుగోలులో మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ముందస్తు వర్క్ ఆర్డర్లు ఇచ్చి టెస్కో కొనుగోలు చేసి కార్మికులకు మార్కెటింగ్ సమస్యను తప్పించాలని మగ్గాల కార్మికులు కోరుతున్నారు. టెస్కో భారాన్ని కార్మికులపై మోపడాన్ని తొలగించాల్సివుంది. రంగులు, అద్దకం, నూతన ఫ్యాషన్ డిజైనర్లపై కార్మికులకు విరివిగా ఉపకార వేతనాలతో కూడిన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాలకు మార్కెట్‌ను విస్తరించాల్సివుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ముద్ర, క్యాష్ క్రెడిట్, వీవర్స్‌క్రెడిట్ కార్డు, మార్కెటింగ్ ఇనె్సంటీవ్, లొంబార్డు బీమా, ఆర్‌ఎస్‌వివై, త్రిఫ్ట్, బునకర్ బీమా, ఆర్‌ఆర్‌ఆర్, పథకాలను చేనేత కుటుంబాలకు మరింత విస్తృతం చేసి కార్మికులకు ఇల్లు, వర్క్‌షెడ్ వసతులు కల్పించాలని నేతన్నలు ఆశిస్తున్నారు
27 నుండి గుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27నుండి మార్చి 9వ తేది వరకు 11రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్. గీత, చైర్మన్ నర్సింహ్మమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు 27వ తేదీ సోమవారం ఉదయం 8.45 గంటలకు స్వస్తి వచనంతో శ్రీకారం చుడతారు. 28వ.తేదీ ఉదయం 11.00గంటలకు ధ్వజారోహణ, రాత్రి భేరిపూజ, దేవతాహ్వాణం, మార్చి 1వ.తేది మత్సావతార అలంకార సేవ, వేదపారాయణాలు ప్రారంభం, రాత్రి శేష వాహణ సేవ, 2వ తేదీ ఉదయం శ్రీకిష్ణాలంకారము, రాత్రి హంసవాహన సేవ, 3వ. తేదీ ఉదయం వటపత్రశాయి అలంకారసేవ, రాత్రి పొన్నవాహన సేవ, 4వ తేదీ ఉదయం గోవర్ధన గిరి ధారి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవలో భక్తులకు దర్శన మిస్తారు. మార్చి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం 5వ తేదీ ఆదివారం రాత్రి 9.00గటంలకు నిర్వహిస్తారు. 6వ తేదీ సోమవారం రాత్రి శ్రీ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, 7వ తేదీ మంగళవారం రాత్రి శ్రీ స్వామి వారి దివ్యవిమాన రథోత్సవం, 8వ తేదీ మహాపూర్ణాహుతి చక్రతీర్థ్ధ స్నానం, రాత్రి దోపు ఉత్సవము, 9వ.తేది జరిగే శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈ ఓ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు భక్తులు జరిపించు మ్రొక్కు కల్యాణాలు జరుపబడవన్నారు. మార్చి 6వ.తేది శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ కళ్యాణంలో పాల్గొను బక్తులు రూ.2500 చెల్లించి టికెట్ ఖరిదు చేయాల్సి ఉంటుందన్నారు. కళ్యాణం రోజున ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసి ఆర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని , గవర్నర్ నరసింహ్మన్ కూడా రానున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు హజరయ్యే భక్తులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత తెలిపారు.
ఘనంగా శివపార్వతుల కల్యాణం
* తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జగదీశ్ రెడ్డి
కేతేపల్లి, ఫిబ్రవరి 25: మండలంలోని 65వ జాతీయ రహదారి వెంట ఇనుపాముల గ్రామంలో గల కాకతీయుల కాలం నాటి శ్రీశ్రీశ్రీ పచ్చల పార్వతిసోమేశ్వరస్వామి వారి కల్యాణాన్ని శనివారం బాల ఆలయంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కల్యాణ మహోత్సవం సందర్భంగా శివాలయానికి మొట్టమొదటి సారిగా రాష్ట్ర విద్యుత్, దళిత సంక్షేమ శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరై పార్వతిసోమేశ్వరస్వామి కల్యాణానికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆలయ అర్చకులు, చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేణుగోపాలశర్మ మంత్రిచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, ఎంపిపి గుత్తా మంజులమాధవరెడ్డి, సర్పంచ్ బత్తుల అహల్యా దయాకర్‌రెడ్డి, ఎంపిటిసి పి.శైలజ సాగర్, ఆలయ చైర్మన్ చిట్యాల శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు చలపతిరెడ్డి, రవి, జోగయ్య, విజయమ్మ, మహేందర్‌రెడ్డి, సుందర్, శ్రీను, సతీష్, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయస్థాయిలో అధ్యయన కేంద్రం
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 25: నాగార్జునసాగర్‌లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా ఆచార్య నాగార్జున అంతర్జాతీయ బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేస్తామని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. శనివారం విదేశీ బౌద్ధ ప్రతినిధుల బృందం సాగర్‌ను సందర్శించిన అనంతరం బుద్ధవనంలోని సమావేశ మందిరంలో విలేఖరులతో మాట్లాడుతూ బుద్ధవనం ప్రాజెక్టులో ఇప్పటికే ఐదు విభాగాలను, వాటి నిర్మాణాలను పూర్తిచేస్తున్నామని, ఈ అధ్యాయన కేంద్రంలో ఒక్క బౌద్ధమతం గురించేకాకుండా గణితం ఆధారమైన విషయాలతో కూడుకున్న పరిఙ్ఞనాన్ని కూడా జోడించి అభివృద్ధిచేస్తామన్నారు. బుద్ధవనంలోని అధ్యయన కేంద్రాన్ని అంతర్జాతీయ బౌద్ధ ఙ్ఞన సంపదకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ అధ్యయన కేంద్రంలో ఆచార్య నాగార్జుని భోదనలకు ప్రాముఖ్యత వచ్చేవిధంగా ఏర్పాటుచేస్తామన్నారు. ఈసమావేశంలో అమెరికాకు చెందిన బౌద్ధమత ఉపాసకులు రోహన్, మలేషియాకు చెందిన ఆనందకుమార్‌తోపాటు పలువురు అంతర్జాతీయస్థాయి బౌద్ధమత భిక్షువులు పాల్గొన్నారు.