నల్గొండ

ఘనంగా రాజరాజేశ్వర బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాపేట, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒగ్గు కళాకారులచే ఆలయం ముందు పెద్ద పటం వేసి పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో దేవతా మూర్తులను పురవీధుల గుండా బాజా భజంత్రీలతో ఊరిగేంపు నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో దేవతా మూర్తులకు స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ బాలమల్లు, ఎంపిటిసి టి.నాగరాణి ప్రమోద్ సింగ్, ఉపసర్పంచ్ బి.యాదగిరి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
చదరంగంతో మేథస్సుకు పదును
* మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రవళిక
సూర్యాపేట, ఫిబ్రవరి 26: చదరంగంతో మేదస్సు పదునెక్కుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. జిల్లాకేంద్రంలో చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి ఓపెన్ చెస్ చాంపియన్‌ఫిప్-2017 ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆమె పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాతన కాలం నుండి దేశంలో చదరంగం ఆట వాడుకలో ఉందన్నారు. ఈ క్రీడలో రాణిస్తే మేథస్సు పెరిగి తద్వారా ఉన్నతికి దోహదపడుతుందన్నారు. రాష్టస్థ్రాయి చదరంగం పోటీలను జిల్లాకేంధ్రంలో నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటలో చెస్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ భవిష్యత్‌లో సూర్యాపేటలో జాతీయస్థాయి చదరంగం పోటీలను నిర్వహించేందుకు కృషిచేస్తామన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అన్నంచిన్ని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ తమిళనాడుకు ధీటుగా తెలంగాణలో చదరంగంను అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి పారుపల్లి చంద్రశేఖర్‌రావు, కన్వీనర్ బంగారపు శ్రీనివాస్, అశోక్, సందీప్, మురళీ, లింగారెడ్డి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లపట్ల దయానంద్, మహిళా క్రీడాకారిణి సంతోషి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన వరుణ్ ప్రథమ, తరుణ్ ద్వితీయ, రవికుమార్‌లు తృతియ బహుమతులను సాధించారు.