నల్గొండ

యూపిలో తమ కూటమిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, మార్చి 2: ఏఐసిసి ప్రధానకార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు గురువారం పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లా నేతలు రేణుకచౌదరితో పాటు ఇతర నాయకులతో కూసుమంచిలో నిర్వహిస్తున్న జన ఆవేదన సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన విరామం కోసం హోటల్-7లో ఆగారు. విరామం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయలేకపోయిందని ఎన్నికల సమయంలో ప్రజలకు గాలిమెడలు చూపించిన మోదీ మూడు సంవత్సరాల పాలనలో ఎలాంటి మేలు చేయలేకపోయాడన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాది కూటమి గెలుపొందే అవకాశం ఉండడంతో బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతూ హిందూ, ముస్లిం మధ్యన చిచ్చుపెట్టి విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, బిహెచ్‌పి సంస్థలు ముస్లింలు నిర్వహిస్తున్న మథర్సాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మోదీ ఎన్ని జిమ్మికులకు పాల్పడిన యూపిలో తమ కూటమికి అధికారం ఖాయమన్నారు. స్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నర్సయ్య, చకిలం రాజేశ్వర్‌రావు, తండు శ్రీనివాస్‌యాదవ్, పోతు భాస్కర్, బైరు వెంకన్నగౌడ్, చెవిటి వెంకన్నయాదవ్, బంటు చొక్కయ్యగౌడ్, గంగాభవాని, మాలి కవిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిస్టుల దాడులు అమానుషం
* బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాదూరి కరుణ
* ఆర్డీఓ కార్యాలయం ముందు బిజెపి ధర్నా
మిర్యాలగూడ, మార్చి 2: కేరళ రాష్ట్రంలో జాతీయవాదంపై కమ్యూనిస్టుల దాడులు చేయడం అమానుషమని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాదూరి కరుణ అన్నారు. జాగృత భారత్ కేరళలో కమ్యూనిస్టుల హింసోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ డిఎఓ రఘునాధ్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈసందర్భంగా పాదూరి కరుణ మాట్లాడుతూ మానవత్వం లేని కమ్యూనిస్టుల దుశ్చర్యలను దేశప్రజలందరు ఖండించాలని ఆమె కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చంద్రవౌళి, బిజెపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పురుషోత్తంరెడ్డి, కమలాకర్‌రెడ్డి, విహెచ్‌పిఎస్ నాయకులు డాక్టర్ నాగేంద్రబోక్రే, ఉపేందర్, నిరంజన్‌రెడ్డి, జాగృత భారత్ పట్టణ కన్వీనర్ తిప్పన వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సుధాకర్, తల్లం వెంకన్న, ఎబివిపి నాయకులు మద్ది వేణుగోపాల్‌రెడ్డి, రాజేశ్, అజయ్, హిందూవాహిణి నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.