నల్గొండ

కేంద్ర ప్రభుత్వ పథకాలపై బిజెపి ఇంటింటి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 15: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటు బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. శుక్రవారం మేళ్లదుప్పలపల్లి, అన్నారెడ్డిగూడెం గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పొతెపాక సాంబయ్య పాల్గొని మాట్లాడారు. మోదీ ప్రభుత్వం బేటీ బచావో, జనథన్ యోజన, ముద్ర రుణాలు, అల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, స్టాండర్ట్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలతో పేదలు, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. ప్రజలు ఆయా పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా, సామాజింగా ఎదుగాలన్నారు. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా పథకం కింద 2.50లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలకు 500కోట్లతో 10లక్షల నుండి 1కోటి వరకు అందిస్తుందన్నారు.