నల్గొండ

దోసపహాడ్ వాసికి రాష్ట్ర ఉత్తమ మహిళా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌పహాడ్, మార్చి 6: వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ మహిళా అవార్డుకు మండలపరిధిలోని దోసపహాడ్ గ్రామానికి చెందిన మహిళా రైతు వరికుప్పల నాగమణి ఎంపికయ్యారు. వ్యవసాయరంగంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం రాష్టస్థ్రాయిలో అత్యుత్తమ మహిళా అవార్డుకు ఎంపికచేయడంతో మండలంలో హర్షతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన వరికుప్పల శ్రీనివాస్ సతీమణి అయిన నాగమణి పంటల సాగులో ఆధునిక పద్ధతులను అవలంభించి సేంద్రియ ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించింది. గ్రామంలో తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో మిర్చి పంటను సాగుచేసి రికార్డు స్థాయిలో 200క్వింటాళ్ల దిగుబడిని సాధించింది. దీంతో గత నెల కేంద్ర ప్రభుత్వం జాతీయ మహేంద్ర అగ్రి అవార్డును ఢిల్లీలో ప్రధానం చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విభాగంలో ఆమె చేసిన కృషిని గుర్తించి రాష్ట్ర ఉత్తమ మహిళా అవార్డును ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ సందర్భంగా నాగమణి ఆంధ్రభూమితో మాట్లాడుతూ రాష్టస్థ్రాయి ఉత్తమ మహిళా అవార్డుకు ఎంపికకావడం ఆనందంగా ఉందన్నారు. పంటల సాగులో ఆధునిక పద్దతులు, మెలుకువలు పాటించడంతో పాటు సేంద్రియ ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించినట్లు చెప్పారు. మహిళలు పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. మహిళలు తక్కువ అన్న భావాన్ని వీడనాడాలని సూచించారు.
నేడు శ్రీవారి దివ్యవిమాణ రథోత్సవం
యాదగిరిగుట్ట, మార్చి 6: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా వేలాది మంది భక్తులు పాల్గొనే శ్రీ స్వామి వారి దివ్య విమాణ రధోత్సవం మంగళవారం రాత్రి జరుగుతుంది. పెళ్లి తంతు పూర్తి చేసుకున్న లక్ష్మీనర్సింహుడు అత్యంత సుందరంగా అలంకరించిన రధంపై బయలుదేరే వేళలో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ చేసే నినాదాలతో యాదాద్రి మారు మ్రోగుతుంది. రథంపై ఊరేగుతుంటే సాక్షాత్తు శ్రీవారే ప్రత్యక్షమైనంత అనుభూతిని పొందుతారు. బుధవారం మహాపూర్ణాహుతి చక్రతీర్థస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు వినతులు
నల్లగొండ రూరల్, మార్చి 6: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెసి సి.నారాయణరెడ్డిలకు వినతి పత్రాలు అందించారు. భూసమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్ల బిల్లులు, విద్యుత్ తదితర సమస్యలపై బాధితులు ఫిర్యాదులు అందించారు. సంబంధిత శాఖలు సదరు సమస్యలపై వెంటనే స్పందించాలని, ఫిర్యాదులను ఆన్‌లైన్ చేయాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను కూడా బాధితులకు తెలుపాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి గ్రీవెన్స్ సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పథకాలను సమర్థవంతంగా గడువులోగా అమలు చేసి నిధులను సద్వినియోగం చేయాలన్నారు. పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తనకు నివేధించి పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, జడ్పీ సిఈవో అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.