నల్గొండ

కల్యాణం.. కమనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మార్చి 6: అఖిలాండకోటి బ్రహ్మోండనాయకుడైన యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం కొండపైన బాలాలయంలో, రాత్రి బస్టాండ్ ఎదురుగా హైస్కూల్ గ్రౌండ్‌లో కమనీయంగా జరిగింది. చూచువారలకు చూడముచ్చటగ, పుణ్య పురుషులకు ధణ్యభాగ్యముగా.. మంగళవాయిద్యాలు మారుమ్రోగు తుండగా పండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా భక్తుల జయ జయ ధ్వానాలు మిన్నంటుతుండగా.. పిలిచిన పలికే ఏకశిఖరవాసుడు నవవధువు లక్ష్మిదేవితో లోక కల్యాణార్థం ఒక్కటయ్యే తంతును అర్చక బృందం కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణ నిర్వహకులైన రుత్వికులు వేదమంత్రాల గోషలో 33కోట్ల దేవతలను ఆహ్వానించి ఉత్సవమునకు ఎలాంటి ఆటంకములు జరుగకుండా చూసేందుకు తొలుత విశ్వక్సేనారాధన జరిపారు. కల్యాణ ద్రవ్యములను సకల జీవులను పవిత్రులను చేసే పుణ్యాహవచనము నిర్వహించారు.జగధ్రక్షకుని రక్షించమంటూ వేడుకుంటూ రక్షాభంధనం గావించారు. కల్యాణ వేడుకలకు ఆచార్య అనుగ్రహమును ప్రసాదించమని వేడుకుంటూ రక్షాబంధణం గావించారు.కల్యాణ వేడుకలకు ఆచార్యఅనుగ్రహం ప్రసాదించమని వేడుకుంటూ యజ్ఞోపవీత ధారణ చేశారు. మంగళ ద్రవ్యములగు జీలకర్ర బెల్లంను సుముహూర్తంలో దేవ వధూవరుల శిరస్సున అలంకరించారు. కల్యాణ సమయంలో శ్రీ లక్ష్మినర్సింహునికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఎంపి బూర నర్సయ్య గౌడ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టిటిడి తరపున టిటిడి అధికార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్ష్మిదేవి తండ్రి సముద్రుడు కాళ్లు కడిగి కణ్యాదానం చేయగా 33 కోట్ల దేవతలు పూల వర్షం కురిపిస్తున్నారా అన్నట్లుగా పరిమళాలు వెదజల్లే అన్ని రకాల పుష్పాలు ఆకాశం నుంచి జాలు వారుతుండగా నరజాతి జంతు జాలాల మేలు కలయికగా ఆవిర్భవించిన శ్రీ నారసింహుడు శ్రీ లక్ష్మిదేవి మెడలో మాంగళ్యధారణ చేశారు. కల్యాణ ఘడియల్లో అషేశ భక్తజనం చూసి తరించారు. వేద మంత్రోచ్చరణలతో, పసుపు పారాణీలతో, మాంగళ్యధారణతో లోకోత్తరబంధమైన శ్రీ లక్ష్మీనరసింహుల కలయిక లోకకల్యాణమై భక్తజన హృదయ రంజకమై అలరారిన శుభతరుణం ఓ జలతారు వెనె్నల ధాత్రిగా ఓ వెనె్నల శుభరాత్రిగా బాసిల్లింది. యాదాద్రిలో హరినామం ప్రతిధ్వనిస్తుండగా అపర వైకుంఠంగా రకరకాల పూలమాలలు, విద్ద్యుత్‌ద్దీపాల వెలుగులో పండువెనె్నలను తలపిస్తుండగా లోక కళ్యానార్ధం మాంగళ్యతంతు కన్నుల పండువగా సాగింది. ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఘనాపాఠి, సురేంద్రా చార్యులు అర్చక బృందం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డిసిపి యాదగిరి, జెసి రవినాయక్, దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్ గీత, వంశపారంపర్య ధర్మకర్త నర్సింహమూర్తి, గుట్ట జడ్పీటిసి కర్రె కమలమ్మ వెంకటయ్య, ఎంపిపి గడ్డమిది స్వప్న రవింధర్ గౌడ్, గుట్ట సర్పంచ్ బూడిద స్వామితో పాటు వివిధ పార్టీల నాయకులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.