నల్గొండ

పోరుగడ్డలో ఎర్రజెండా సామాజిక న్యాయం గర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 9: పోరుగడ్డ నల్లగొండ నుండి సిపిఎం మహాజన పాదయాత్ర మరోసారి సామాజిక న్యాయం సాధన నినాదాన్ని ప్రతిధ్వనింపచేసింది. బలిదానాలతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించి వెట్టిబతుకుల నుండి విముక్తి పొందిన పోరుబిడ్డల గడ్డ నల్లగొండ నుండి ఎర్రజెండా సరికొత్త రాజకీయాలకు తెలంగాణలో శ్రీకారం చుడుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు ప్రకటించారు. గురువారం మహాజన పాదయాత్ర నల్లగొండకు చేరిన సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతు తెలంగాణ వచ్చినా రాష్ట్ర ప్రజల కలలు నెరవేరలేదన్నారు. ఈ నెల 19న హైద్రాబాద్‌లో జరిగే మహాజన పాదయాత్ర ముగింపు బహిరంగసభతో తెలంగాణలో ప్రజలు కేంద్రంగా అభివృద్ధి, సామాజిక న్యాయం, సమన్యాయంతో కూడిన సామాజిక తెలంగాణ సాధనకు సిపిఎం సరికొత్త రాజకీయాలను ఆవిష్కరిస్తుందన్నారు. తమ్మినేని ప్రసంగిస్తు 5వేల కిలోమీటర్ల మేరకు సాగుతున్న మహాజన పాదయాత్ర ఓట్ల కోసమో, ఎన్నికల కోసమో, రాజకీయాల కోసమో కాదన్నారు. సమన్యాయం, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధినే తమ పాదయాత్ర లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం కెసిఆర్ మాయమాటలు, గారడి మాటలతో పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. రైతులు, ప్రజల భూములను బలవంతంగా లాక్కొంటు పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారన్నారు. విశ్వనగరం చేస్తానంటు, డబుల్ బెడ్‌రూమ్‌లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, కెజి టూ పిజి ఉచిత విద్య, లక్ష ఉద్యోగాలని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లంటు వెంకయ్యనాయుడు బెదిరింపులతో కెసిఆర్ వెనక్కి తగ్గారన్నారు. సిపిఎం మహాన పాదయాత్ర కెసిఆర్ ప్రభుత్వంలో వణుకు పుట్టించిందని అందుకే ఎంబిసి కమిషనర్ వేశారని, గొర్రెల పంపిణీ, మత్స్యకార్మికులు, గీత కార్మికులకు వరాలు ప్రకటిస్తున్నారన్నారు. సామాజిక న్యాయం సాధనకు తెలంగాణ సమగ్రాభివృద్ధికి, జనాభా థామాషా మేరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు బడ్జెట్ కేటాయింపులకు సిపిఎం మహాజన పాదయాత్ర ముగింపు బహిరంగ సభతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఈ పాదయాత్రకు సిపిఎం శ్రేణులు బోనాలు, బతుకమ్మలతో, వృత్తిదారుల ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డితో పాటు టిడిపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లా పార్టీ కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాజన పాదయాత్ర సభలో పార్టీ నాయకులు జాన్‌వెస్లీ, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, మల్లు స్వరాజ్యం, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, మల్లు వెంకటనరసింహారెడ్డి, లక్ష్మీ, ప్రభావతి, హషీమ్ పాల్గొన్నారు.