నల్గొండ

చేతబడి నెపంతో మహిళపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, మార్చి 11: మండల పరిధిలోని రాయినిగూడెం గ్రామంలో పెళైన వారానికే యువకుడు అకస్మాత్తుగా మృతిచెందడంతో ఆగ్రహించిన బంధువులు చేతబడి చేశారనే కారణంతో గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడిచేశారు. సంఘటనకు సంబంధించి గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పగిళ్ల ఆంజనేయులు (25) ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి గత ఆదివారం చివ్వెంల మండలం బండమీదిచందుపట్ల గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. శనివారం ఆంజనేయులు తనకు బాగా నీరసంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతనికి ఎలాంటి జబ్బు లేదని నిర్దారించారు. దీంతో వారు ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికే ఆంజనేయులు తాను బతకనని తన సమీప బంధువులు పగిళ్ల జానకమ్మ, కమలమ్మలు తనను చంపేస్తున్నారని కుటుంబసభ్యులకు చెప్పినట్లు గ్రామంలో ప్రచారం జరిగింది. అప్పటి వరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నీరసంగా ఉందని చెప్పిన రెండు గంటల లోపే చనిపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు చేతబడి చేసిందనే ఆరోపణతో జానకమ్మ, కమలమ్మల ఇండ్లపైకి మూకుమ్మడిగా దాడిచేసేందుకు వెళ్లారు. విషయాన్ని గమనించిన కమలమ్మ తప్పించుకొని పారిపోగా ఇంట్లో దొరికన జానకమ్మను బయటకు లాక్కొచ్చి కొట్టారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి జానకమ్మను జీపులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు జీపునకు అడ్డుతగిలి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట డిఎస్పి సునీతామోహన్, రూరల్ సిఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు ఇతర మండలాల ఎస్‌ఐలు అక్కడికి చేరుకొని పోలీస్ జీపును అక్కడి నుండి పంపించివేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు జాతీయ రహదారి నెంబర్ -65పై ధర్నా చేసేందుకు ఉపక్రమించారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికి గ్రామస్థులు వినిపించుకోకపోవడంతో పాటు ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్థులను చెదరగొట్టారు. అనంతరం డిఎస్పీ బాధితుని కుటుంబ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎలిమినేటిని కలిసిన నాయకులు
భూదాన్‌పోచంపల్లి, మార్చి 11: టిఆర్‌ఎస్ సీనియర్ నేత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శనివారం ఆయన స్వగృహంలో భూదాన్‌పోచంపల్లి మండలానికి చెందిన నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బొంగు శంకరయ్య గౌడ్, నాయకులు మైసగోని వెంకటేశం, కల్లెం రాఘవరెడ్డి, బొంగు ఐలయ్య, కార్తీక్, సత్తయ్య, మారగోని నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.