నల్గొండ

ఛాయ సోమేశ్వర ఆలయంలో హరికృష్ణ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 11: టిడిపి సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ శనివారం నల్లగొండ పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి శివలింగాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఆయన ఈ ఆలయానికి వచ్చారు. ఆలయ శిల్పకళా ప్రత్యేకతలను, శివలింగంపై నిరంతరం నిశ్చలంగా కనిపించే స్తంభపు ఛాయ విశేషాలను తన వెంట ఉన్నవారికి హరికృష్ణ ఉత్సాహంగా వివరించారు. హరికృష్ణకు ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలనంతరం సత్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తాను గతంలో ఛాయ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించానని, అనంతరం తనకు అంతా మంచి జరిగిందన్నారు. మరోసారి తాను స్వామివారిని మళ్లీ దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఛాయ సోమేశ్వర ఆలయం అభివృద్ధికి నోచుకోవడం అభినందనీయమన్నారు. అద్భుత శాస్త్ర విజ్ఞానాన్ని, శిల్పకళ నైపుణ్యాలను మేళవించి రూపొందించిన చారిత్రాక ఛాయ సోమేశ్వర ఆలయం ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఎంతో చారిత్రక, శిల్పకళా ప్రత్యేకతతో పాటు మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని ప్రజలు పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఆలయాలు ప్రజల సంపదని, వాటి పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఇటువంటి గొప్ప చారిత్రాక ఆలయాలను భావితరాలు దర్శించునేలా ప్రభుత్వాలు అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. హరికృష్ణ వెంట టిడిపి జిల్లా నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, పిల్లి రామరాజు, సహదేవ్, సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.

ముస్లిం స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిస్తాం
* రాష్ట్రం బిసి కమిషన్ సభ్యుడు జూలూరి గౌరిశంకర్

సూర్యాపేటటౌన్, మార్చి 11: రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పర్యటించి ముస్లీంల స్థితిగతులపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి కెసిఆర్‌కు నివేదిక సమర్పించడం జరుగుతుందని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యుడు జూలూరి గౌరిశంకర్ అన్నారు. రాష్టవ్య్రాప్తం పర్యటనలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లాలో ఆయన పర్యటించారు. మొదట చర్చికంపౌడ్‌లో గల మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పిఎస్‌ఆర్ సెంటర్‌లోని మసీద్, కుడకుడ రోడ్డులో గల మసీద్‌లకు వెళ్లి మత పెద్దలతో చర్చించారు. ఈసందర్భంగా ఆయనకు ముస్లిం సంఘాల ప్రతినిధులు ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం జిల్లాలోని ఇతర మండలాల్లో అద్యయనం చేసేందుకు వెళ్లారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, డిబిసిడివో సామేలు, జెడి చంద్రశేఖర్, 10వ వార్డు కౌన్సిలర్ జ్యోతికరుణాకర్, మార్కెట్ డైరెక్టర్ సల్మా, మైనార్టీ నాయకులు మీర్ అక్బర్ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడం అభినందనీయమని బిసి-ఈ కమిషన్ మెంబర్ జూలూరి గౌరిశంకర్ అన్నారు. వారు శనివారం మండలపరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే సగం వ్యాధులు తగ్గుతాయని అందుకు నిదర్శనం పెన్‌పహాడ్ పిహెచ్‌సి డాక్టర్, సిబ్బందే అని కొనియాడారు. సామాన్య, మధ్యతరగతి వారి స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలన్నారు. గతంలో రోజుకు 10నుండి 20మంది పెన్‌పహాడ్ పిహెచ్‌సిలో వైద్య పరీక్షలు చేయించుకుంటే ఇప్పుడు రోజుకు 100 నుండి 150 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం డాక్టర్ల పనితీరుకు నిదర్శనమన్నారు. పెన్‌పహాడ్ పిహెచ్‌సిని జిల్లాలో ఆదర్శంగా తీసుకొని అన్ని పిహెచ్‌సిలను అభివృద్ధి పర్చుకోవాలన్నారు. వైద్యుల సేవలను పేదలు సద్వినియోగపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో బిసి కమిషన్ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేకర్, బిసి కమిషన్ జిల్లా అధికారి సామేలు, జిల్లా మైనార్టీ సెల్ అధికారి శ్రీనివాస్, డాక్టర్ మొహినొద్దిన్ పాల్గొన్నారు.

ఒక్క హామీని పూర్తిచేయని కెసిఆర్
పాదయాత్రకు జంకి సభకు అనుమతి నిరాకరణ * గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ పథకాల ప్రస్తావన లేదు
* మిషన్ భగీరథ పేరిట ఫ్లోరైడ్ సమస్యను పక్కనపెట్టిన సిఎం * సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
చిట్యాల, మార్చి 11: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాను ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని కూడా పూర్తిచేయలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సిపిఎం మహాజన పాదయాత్ర నల్లగొండ జిల్లా చిట్యాలకు శనివారం చేరుకున్న సందర్భంగా పాదయాత్ర రథసార ధి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేఖరుల సమావేవంలో మాట్లాడారు. తమ పాదయాత్ర ఐదు మాసాల్లో 3900 కిలోమీటర్లు పూర్తిచేసుకుందని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు సామాజికన్యాయం-సమగ్రాభివృద్ధి కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను చేపట్టిందే తప్ప పార్టీ బలనిరూపణ కోసం కాదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సిఎం కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి పరిపాలనను కొనసాగిస్తున్నారని, హామీల అమలు సామాజికన్యాయం-సమగ్రాభివృద్ధిని సాధించేందుకు తమ పాదయాత్ర ప్రజలకు దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు. తమ పాదయాత్రతో ప్రభుత్వంలో చలనం కలిగిందని, అందుకే కొన్ని కులాల ప్రాతిపదికన సిఎం కెసిఆర్ వరాల జల్లులు కురిపిస్తున్నారన్నారు. మహాజన పాదయాత్రకు సిఎం కెసిఆర్ భయపడి జంకి ఈనెల 19న తమ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ కోసం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల ప్రాంగణంలో నిర్వహించేందుకు అనుమతిని కోరగా పోలీసుశాఖ అనుమతినిచ్చి ఆ తరువాత పొరపాటు జరిగిందని, అనుమతిలేదని లేఖ పంపించారన్నారు. ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌ను కూడా రద్దుచేయడంలో ఆంతర్యమేంటో ప్రజలకు సమాధానం చేప్పాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద సిఎం కెసిఆర్ కుర్చీ వేసుకుని పూర్తిచేయిస్తామని చెప్పారని ఇప్పటికీ ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని సిఎంకు కుర్చీ దొరకలేదా ఏమైందని అని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని ఆచరణలో మాత్రం శూన్యమే మిగిలిందన్నారు.
ఇక శాసనసభా సమావేశాల ఆరంభంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో సిఎం కెసిఆర్ చేపట్టిన పథకాలు ప్రస్తావనకు రాలేదని, సిఎం కెసిఆర్ మానస పథకం డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం చెప్పించకపోవడం తూతూమంత్రమేనన్నారు. ఎంతోమంది తాగునీరు లభించక ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యానికి గురవుతున్నారని సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరైడ్ సమస్యను పక్కన పెట్టారన్నారు. తమ పాదయాద్ర ముగింపు సభ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ అవుట్‌డోర్ స్టేడియంలో జరుగుతుందని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మతతత్వ ఎజెండాతో బిజెపి ఉత్తర్‌ప్రదేశ్‌లో లాభపడిందని, దేశ సెక్కులరిజం ప్రమాదంలో పడే అవకాశమున్నదని, లౌకికశక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదన్నారు. దేవరకొండ కేంద్రంగా ఐటిడిఎను ఏర్పాటు చేయాలని, గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని, రైస్‌మిల్ పరిశ్రమలను ఆదుకోవాలని, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి నిధులు విడుదల చేసి, ఖాళీలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కథానాయకుడు మాదాల రవి పాల్గొన్నారు.