నల్గొండ

హోలీ రంగుల్లో విరిసిన హరిత హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 12: జిల్లా కేంద్రంలో జరిగిన హోళి పండుగ వేడుకల్లో హరిత హారం స్ఫూర్తి వెల్లివిరిసింది. అంతా రంగుల పండుగ సంబరాల్లో మునిగితేలినప్పటికి మధ్యలో మొక్కల పెంపకం ఆవశ్యకతను చాటుతు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆకట్టుకున్నారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన హోళి వేడుకల మధ్యలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెసి సి.నారాయణరెడ్డిలు మొక్కలు నాటి హరిత హారం స్ఫూర్తిని చాటారు. ఇక రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి తన నివాసం వద్ధ ప్రత్యేకంగా నిర్వహించిన హోళి వేడుకల్లో తనతో పాటు వేడుకల్లో పాల్గన్న వారికి ‘సేవ్ ట్రీస్’ టీషర్ట్‌లు ధరింపచేసి తమ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం ప్రాధాన్యతను చాటి చెప్పడం విశేషం.
మోత్కూరు: రసాయన రంగులు కాకుండా పకృతి రంగులతోనే హోళీ సంబరాలు జరుపుకోవాలని సింగిల్ విండో చైర్మన్ కె రామకృష్ణ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సిహెచ్ మహేంద్రనాథ్, ఎంపిపి ఓర్సు లక్ష్మీ అన్నారు. ఆదివారం ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ మోత్కూరు శాఖ, ప్రజాభారతి సాహితీ సేవాసంస్థ ఆధ్వర్యంలో రసాయన రంగులతో అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దని, పకృతి రంగులే వాడాలి అనే నినాదాలతో చెట్టు బొమ్మలు ఉన్న టీ షర్టులు ధరించి పూల మొక్కలతో ప్రదర్శన నిర్వహిస్తూ వినూత్నంగా హోళీ సంబరాలు చేశారు.