నల్గొండ

గుండెపోటుతో రైలు ప్రయాణికుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, మార్చి 13: హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెలుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ధన్‌రాజ్ (61) రైల్వే ప్రయాణికుడు గుండెపోటుతో సోమవారం ఆలేరు రైల్వేస్టేషన్‌లో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్లే ధనరాజ్ వృత్తిరిత్యా హైకోర్టు న్యాయవాది. తన కేసు విషయంలో సుప్రీం కోర్టుకు హాజరవుతున్న క్రమంలో భువనగిరి ఆలేరు రైల్వే స్టేషన్ మధ్య ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆలేరు రైల్వే స్టేషన్ చేరుకునేసరికి పరిస్థితి విషమించి మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బుద్ధారంలో క్షుద్ర పూజల కలకలం..
భయాందోళనలో గ్రామస్థులు
నల్లగొండ రూరల్, మార్చి 13: మండలంలోని బుద్ధారం గ్రామంలో సోమవారం క్షుద్రపూజల కలకం రేకిత్తించింది. వివరాల్లోకి వెళితే ఇదే గ్రామానికి చెందిన బైరగోని యాదయ్య, రాములుల ఇంటిముందు ఉదయం కుటింబికులు లేచి వాకిటి ఉడ్చే క్రమంలో నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకలు, పసుపుకుంకుమ, రాసిన కాగితాలు కుప్పగా పోసి ఉన్నాయి. అదే విధంగా యాదయ్య ఇంటిముందు పార్కింగ్ చేసిన కారుపై, టూవీలర్‌పై కుంకుమ, నిమ్మకాయలు వేసి ఉన్నాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా పడడంతో గ్రామస్థులు చూసి భయాందోళనలకు గురయ్యారు. స్థానిక సర్పంచ్ దేవరాంపల్లి అలివేలు వెంకట్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీసులకు సైతం సమాచారం అందడంతో గ్రామాన్ని సందర్శించారు.
ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి కామునిపూర్ణిమ పురస్కరించుకొని ఎవరో గిట్టని వారు తమపై బాణామతి చేసి ఉండవచ్చని కుటింబికులు భయపడుతున్నారు.

ముగిసిన ఇంటర్ ‘ప్రథమ’ పరీక్షలు..
కనగల్, మార్చి 13: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం నాటితో ముగిసిపోగా పరస్పరం పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు పరస్పరం వీడ్కోలు చెప్పుకుంటు ఉద్వేగపూరిత వాతావరణంలో తమతమ ఇళ్లకు పయనమయ్యారు. విద్యార్థులు తమ స్నేహితుల చిరునామాలు, సెల్‌ఫోన్ నెంబర్లు తీసుకుంటు ఒకరికొకరు వీడ్కోలు తెలుపుకున్నారు. జిల్లాలో ఇంటర్ తొలి ఏడాది పరీక్షలకు 18,119 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 25,510 మంది విద్యార్థులు హాజరయ్యారు.