నల్గొండ

సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 16: పదవ తరగతి పరీక్షలు నేడు శుక్రవారం నుండి ప్రారంభంకానుండగా పరీక్షల సక్రమ నిర్వాహణకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లతో సిద్ధమైంది. ఉదయం 9:30నుండి మధ్యాహ్నం 12:15వరకు నిర్వహించే పరీక్షలకు నిర్వాహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అధికారులు ముందస్తు సన్నాహాలు చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 213పరీక్ష కేంద్రాల్లో 46,401మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవుతున్నారు. నల్లగొండ జిల్లాలో 103పరీక్షా కేంద్రాల్లో 21,832మంది విద్యార్థులు, సూర్యాపేట జిల్లాల్లో 61కేంద్రాల్లో 14,141మంది, యాదాద్రిభువనగిరి జిల్లాలో 49కేంద్రాల్లో 10,428మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నల్లగొండ జిల్లాలోని 103పరీక్ష కేంద్రాల్లో 103మంది చీఫ్ సూపరిండెంట్లు, 103మంది డివోలు, ఆరు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 1805మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొననున్నారు.
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన టేబుల్స్, విద్యుత్, తాగునీరు, ప్రాథమిక వైద్య వసతి వంటి వౌలిక సదుపాయలు సిద్ధం చేశారు. హాల్‌టికెట్ల పంపిణీ పూర్తవ్వగా అందని వారు ఎవరైనా ఉంటే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ధ 144సెక్షన్ అమల్లో ఉండనుండగా జీరాక్స్, ఇంటర్నేట్ దుకాణాలు పరీక్ష సమయాల్లో మూసివేసి ఉంచుతారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వచ్చివెళ్లేందుకు వీలుగా ఉదయం, మధ్యాహ్నాం వేళ్లల్లో ఆర్టీసి ప్రత్యేక బస్సు సర్వీస్‌లు నడిపిస్తుంది. పరీక్ష విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు విద్యార్థులు సెల్‌ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పరీక్ష కేంద్రాల్లోకి రాకూడదు. విద్యార్థులకు ప్యాడ్, హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బర్‌లు, మంచినీటి సీసాలకు మాత్రమే అనుమతినిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధులు అంతా కూడా తమ పాఠశాలల ఏకరూప దుస్తులు ధరించి పరీక్షలకు హాజరుకాకుడదనే నిబంధన అమలు చేస్తున్నారు. ఉదయం 9-30నుండి పరీక్ష ప్రారంభంకానున్నందునా విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ధకు గంట ముందు చేరుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని డిఈవో చంద్రమోహన్ తెలిపారు. పరీక్షల నిర్వాహణలో ఏవైనా సమస్యలుంటే కంట్రోల్‌రూమ్ 08682-244208 ఫోన్ నెంబర్‌కు సంప్రదించవ్చని తెలిపారు. పరీక్షల విధుల్లో అవతవకలకు పాల్పడిన సిబ్బందిపైన చట్టపరంగా కఠిన చర్యలుంటాయని పరీక్షలు సజావుగా కొనసాగేందుకు అధికారులు, విద్యార్థులు అంతా సహకరించాలని కోరారు.