నల్గొండ

‘2019లో కాంగ్రెస్‌దే అధికారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 19: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు బాహుబలులై రానున్న 2019 ఎన్నికల్లో అధికా రం చేజిక్కించుకోవాలని రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ పక్ష నాయకులు కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం స్థా నిక రాజీవ్‌భవన్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి.కరీం, బ్లాక్ టూ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ముంచిన కెసిఆర్ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అదే విధంగా గొర్రెలు, మేకలు కెసిఆర్ ఇస్తానంటున్నాడని, రేపు మేతకు భూమి లేదంటు ఇవ్వకుండా మొండి చేయి చూపే అవకాశం ఉందని, ఆ విషయాన్ని కార్యకర్తలు గమనించాలని కోరారు. దళితులకు మూడెకరాల భూమి లేదని, డబుల్‌బెడ్ రూం లేదని, రుణ మాఫీ సక్రమంగా జరగడం లేదని అన్ని వాగ్దానాల అమలులో విఫలమైనారని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేకతను తెలుసుకుని పార్టీ పటిష్టతకై పాటు పడాలని ఆయన కోరారు. పదవులు రాలేదని అసంతృప్తి వద్దని, అందరికి అవకాశం వస్తుందని ఆయన అన్నారు. పార్టీ పదవులు, అనుబంద సంఘాల పదవులు అనేక ఉ న్నాయని అందరికి న్యాయం చేస్తామని ఆయన అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు లాభం చేకూరుతుందన్న వి శ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. జానారెడ్డి నా యకత్వంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేయాలని శంకర్‌నాయక్, కరీంలు అన్నారు. మాజీ చీఫ్ విప్ డి.్భరతిబాయిరాగ్యానాయక్, పిసిసి కా ర్యదర్శి డి.స్కైలాబ్‌నాయక్, పి.రాంలింగయ్య, కె.లక్ష్మారెడ్డి, చంద్రారెడ్డి, మట్టారెడ్డి, కోటిరెడ్డి, బసవయ్య పాల్గొన్నారు.

ఇంటిబాట పట్టిన విద్యార్థులు

ముగిసినఇంటర్ పరీక్షలు
నార్కట్‌పల్లి, మార్చి 19: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆదివారం నాటితో ముగిశాయి. రెండేళ్ల పాటు తీవ్ర ఒత్తిళ్ల మధ్య ఇంటర్ కోర్సును చదివి వార్షిక పరీక్షలు ముగించుకున్న విద్యార్ధిని విద్యార్థులు పరీక్షలు ముగిసిన వెంటనే ఉత్సాహంగా ఇంటిబాట పట్టారు. పరీక్ష కేం ద్రాల వద్ధ పరీక్షలు ముగిసిన వెంటనే తమ తోట స్నేహితులకు వీడ్కోలు పలుకుతు వారి సెల్‌ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు తీసుకుంటు సందడి చేశారు. ఇంటర్ పిదప భవిష్యత్‌లో ఎవరెవరు ఏయే కోర్సుల్లో చేరి ఎక్కడెక్కడ చదువుతారోనంటు మళ్లి ఎక్కడ కలుస్తామనంటు పరస్పరం ఉద్విగ్నతల మధ్య విద్యార్థులు వీడ్కోలు చెప్పుకుంటు కనిపించా రు. పరీక్షల అనంతరం హాస్టల్స్, కళాశాలల నుండి తల్లిదండ్రులతో కలిసి, తోటి విద్యార్థులతో తమ సామాగ్రితో సహా ఇంటి బాట పట్టారు. ఆటోలు, బస్సుల్లో ఇళ్లకు వెళ్లే ఇంటర్ విద్యార్థుల కోలాహలం సందడి చేసింది. జిల్లా వ్యాప్తంగా 25,150మంది విద్యార్థులు హాజరయ్యారు

ఎంజి వర్సిటీ నిర్వహణ అస్తవ్యసం
కనగల్, మార్చి 19: ఎంజి యూనివర్సిటీ నిర్వాహణ, పరీక్షల నిర్వాహణ, మూల్యాంకన ప్రక్రియలు అస్తవ్యస్తంగా అక్రమాల మయంగా మారాయని బిసి విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్ధన్‌గౌడ్ ఆరోపించారు. ఇ టీవల నిర్వహించిన ఇంజనీరింగ్ పరీక్షల్లో 75మార్కుల పరీక్షకు 76మార్కులు వేయడం యూనివర్సిటీ నిర్వాకానికి నిదర్శమన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫెయిలైన మోమోలు రావడం, పరీక్షకు హాజరైన వారికి సున్న మార్కులు వేయడం వంటి అక్రమాలు చోటుచేసుకున్న తీరు విద్యార్థుల్లో యూనివర్సిటీ అంటేనే భయం కల్పిస్తుందన్నారు. 2016డిసెంబర్‌లో విడుదలైన బిటెక్ పరీక్ష ఫలితాలు సైతం తారుమారు జరిగాయని, రివాల్యుయేషన్‌లో ఉత్తీర్ణత పొందిన సబ్జక్టులను సైతం ఫెయిలైనట్లుగా చూపుతుండటం దారుణమన్నారు. ఈరకమైన అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని విద్యార్థుల జీవితాలను కాపాడాలని కోరారు. బిసి విద్యార్ధి సంఘం నాయకులు పొగాకు రవికుమార్, రాజుయాదవ్, శ్రీ్ధర్‌గౌడ్, ఉదయ్, సాయిచంద్ పాల్గొన్నారు.