నల్గొండ

లారీలు దగ్ధం చేసిన డ్రైవర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 23: మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో పాత రైస్‌మిల్లు ఆవరణలో నిలిపి ఉన్న రెండు లారీలను దగ్ధం చేసిన కేసులో నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్టు వన్‌టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి తెలిపారు. గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 19 ఒక లారీ 4 టైర్లకు, మరో లారీ కాబిన్‌కు నిప్పు పెట్టడం జరిగింది. ఫిబ్రవరి ఒకటిన నిందితుడు ఎండి.అహ్మద్ ఎపి 24 టివి 2277 నెంబర్ గల లారీపై డ్రైవర్‌గా లోగా చేరి నెల్లూరు, మహారాష్ట్ర, విశాఖపట్నంలకు గూడ్స్‌ను రవాణాకై వెళ్లి మార్చి ఒకటిన వచ్చి తన వేతనం ఇవ్వాలని లారీ యజమాని శాగ జయేందర్‌రెడ్డిని కోరగా అతను 10,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు లెక్క చూసుకుని ఇస్తమని చెప్పి నెలలు గడుస్తున్న ఇవ్వకపోవడంతో యజమానికి నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో తన మేన బావ ఇర్ఫాన్ సహాయంతో పెట్రోల్ తీసుకువచ్చి నిలిపి ఉన్న లారీలు ఎపి 29-వి-4899, ఎపి 24 టిబి 2277లకు నిప్పు పెట్టడంతో 4 టైర్లు మరో లారీ కాబిన్ దగ్ధమయ్యాయని ఆయన తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపామని తెలిపారు. సిసి కెమెరాల ఫుటేజ్ ప్రకారం నిందితులను గుర్తించామని ఆయన తెలిపారు. వారిని విచారించగా నేరం ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. నిందితులను గురువారం అరెస్టు చేసి స్థానిక జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పద్మజ ముందు హాజరు పర్చగా జ్యుడిషియల్ కస్టడికి పంపుతూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్స్ మట్టయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో
బిజెపి, బిజెవైఎం నేతల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి, మార్చి 23: మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బిజెపి, బిజెవైఎంలు నేడు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో గురువారం ఆ పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌చేసి స్టేషన్‌లలో నిర్భందించారు. నల్లగొండ , కనగల్, నార్కట్‌పల్లి, తిప్పర్తి, దేవరకొండ, మిర్యాలగూడతో పాటు వివిధ మండలాల్లో సైతం బిజెపి, బిజెవైయం నాయకులను చలో అసెంబ్లీకి వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్ చేశారు. నల్లగొండ పట్టణంలో బిజెపి నాయకులు మొరిశెట్టి నాగేశ్వర్, బాకి పాపయ్య, బొజ్జ నాగరాజు, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు పోతెపాక లింగస్వాములను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

దళారుల కందుల పట్టివేత
చండూరు మార్కెట్ యార్డులో 21.5 క్వింటాళ్లు స్వాధీనం * 6ఎ కింద కేసు నమోదు

చండూరు, మార్చి 23: చండూరు కందుల కొనుగోలు కేంద్రంలో దళారులు తీసుకొచ్చిన కందులను అధికారులు గురువారం పట్టుకున్నారు. గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామానికి చెందిన కజ్జం దయాకర్‌కు చెందిన ట్రాక్టర్‌లో అదే గ్రామానికి చెందిన ఓరుగంటి పద్మాకర్, లింగన్నపాడు గ్రామానికి చెందిన నాగులవంచ కిషన్ రావు స్థానికంగా రైతులు వద్ద కొనుగోలు చేసిన కందులు 21.5 క్వింటాళ్లు చండూరు మార్కెట్ యార్డులోని కందుల కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏసిఎస్‌వో కేశన్న, చండూర్ సివిల్ సప్లై డిటి ఆంజనేయులు చండూరు కొనుగోలు కేంద్రం వద్ద మాటువేసి సదరు కందులను, ట్రాక్టరును పట్టుకున్నారు. తదానంతరం పంచనామ నిర్వహించి వారిపై 6ఎ కేసును నమోదు చేశామని తెలిపారు. ఈ కందులను భద్రపరిచే పనిలో భాగంగా మార్కెట్ యార్డులోని గోపికృష్ణ ట్రేడర్స్ యజమాని తేలుకుంట్ల జానయ్యకు అప్పగించారు. ట్రాక్టరుపై చండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ట్రాక్టరును స్టేషన్‌కు అప్పగిస్తామని, తదుపరి చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్‌కు నివేదికను అందజేయనున్నట్లు ఎసిఎస్‌వో శేషన్న తెలిపారు. ట్రాక్టర్ ఇంజన్‌కు ట్రాలీకి రిజిష్ట్రేషన్, డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడం గమనార్హం.