నల్గొండ

మిర్యాలగూడ ఇఎస్‌ఐకి 30 పడకల ఆసుపత్రిగా అనుమతివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 23: మిర్యాలగూడ పట్టణంలోని ఇఎస్‌ఐ ఆసుపత్రిని డిస్పెన్సరి ఆసుపత్రి నుండి డయాగ్నస్టిక్ సెంటర్‌గా, 30 పడకల ఆసుపత్రి మంజూరు అనుమతి ఇవ్వాలని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాది కల్పన శాఖమంత్రి బండారు దత్తాత్రేయను గురువారం కలిసి వినతిపత్రాన్ని అందచేశారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. మిర్యాలగూడ ప్రాంతంలో సుమారు 8వేల నుండి 9వేల వరకు కార్మికులు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో నమోదు చేసుకున్నారని, అద్దె భవనంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి కొనసాగడం వల్ల సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సొంత భవనాన్ని మంజూరుచేయాలని ఆయన కోరారు. డిప్యూటేషన్‌పై ఆసుపత్రికి వచ్చి వైద్యసేవలందిస్తున్నారని పర్మినెంట్‌గా ఆసుపత్రి ఇంచార్జి, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లను నియమించాలని కోరారు. ల్యాబ్ టెక్నిషియన్‌ను, నలుగురు నర్సులను, ముగ్గురు ఫార్మాసిస్ట్‌లను, ఇసిజి టెక్నిషియన్‌లను నియమించాలని కోరారు. పూర్తిస్థాయిలో ఇఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించి కార్మికులకు సరైన వైద్యసేవలందేలా చూడాలని కోరారు. ప్రతి నెల 20మంది వరకు గర్భిణీలు డెలివరీ అవుతున్నారని, 30మంది వరకు గుండెజబ్బులు, ఇతర జబ్బులు ఉన్నవారిని ఆసుపత్రికి పంపిస్తున్నారని అందువల్ల డిస్పెన్సరి నుండి డయాగ్నస్టిక్ సెంటర్‌గా మార్చి కార్మికులకు సరైన వైద్యం అందేలా చూడాలని కోరారు.
పివి శ్యాంసుందర్ రావుకు బెయిల్
భువనగిరి, మార్చి23 : ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్‌రావుతో పాటు 11 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలు గురువారం బెయిల్‌పై విడుదలైయ్యారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు బాణాసంచా కాల్చి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్యాంసుందర్‌రావు మాట్లాడుతూ మత ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లును ఉప సంహరించేవరకు ఉద్యమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నర్ల నర్సింగరావు, వేముల అశోక్, చందా మహేందర్‌గుప్త, చిట్టిపోలు శ్రీ్ధర్, రత్నపురం శ్రీశైలం, నర్సింహా చారి పాల్గొన్నారు.