నల్గొండ

హామీల అమలుకు సిపిఐ ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 23: టిఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలుకు డిమాండ్ చేస్తు సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు గురువారం జిల్లా వ్యాప్తంగా తహశీల్ధార్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు నిర్వహించాయి. నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గ మండలాల తహశీల్ధార్ కార్యాలయాల ముందు సిపిఐ శ్రేణులు ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందించాయి. నల్లగొండ తహశీల్ధార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సిపిఐ ధర్నాలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతు ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌లు, దళితులకు మూడెకరాల భూమి, కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని నేటికి ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు అలాగే ఉన్నాయన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారిస్తామంటు మిషన్ భగీరథ చేపట్టినప్పటికి అసంపూర్తిగానే పనులు సాగుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై, ఎన్నికల హామీల అమలుకై సిపిఐ ప్రజాపక్ష ఉద్యమాలు సాగిస్తుందని ఈ నెల 27న కలెక్టరేట్‌ల ముట్టడితో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకు లెనిన్‌బాబు, ఎస్‌కె.మధార్, యూసఫ్, రఫీ, కె.నరసింహ, ఈశ్వరమ్మ, నిర్మల, సునీత, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.