నల్గొండ

నిమ్స్‌కు 40కోట్ల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 23: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం గురువారం రూ.40కోట్లు విడుదల చేస్తు ఆదేశాలిచ్చింది. దీంతో ఆసుపత్రి అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. బీబీనగర్ నిమ్స్‌లో ప్రస్తుతం అవుట్ పేషెంట్ వైద్య సేవలు మాత్రమే అందుతున్నారు. ఇన్‌పేషంట్ సేవలతో పాటు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిగా నిమ్స్‌ను తీర్చిదిద్దుతామని గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు తాజాగా మంజూరు చేసిన రూ.40కోట్ల నిధులు ఈ దిశగా ఆసుపత్రి వైద్య సేవల విస్తరణకు ఉపకరించనున్నాయి. అయితే తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను బీబీనగర్ నిమ్స్ వద్దనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుండటం ఈ మేరకు గతంలో సిఎం కెసిఆర్ సైతం హామీ ఇచ్చారు. అయితే కేంద్రం ఎయిమ్స్ ఏర్పాటుకు మూడు ప్రాంతాల పేర్లను సూచించాలని కోరగా ఎయిమ్స్ చివరకు బీబీనగర్‌లోనే ఏర్పాటవుతుందా లేక మరో జిల్లాకు తరలిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎడమకాల్వ కింద పంటను రక్షించాలి
15వరకు నీటి విడుదల చేయాలి
* పాలకుల ముందుచూపు లేమితోనే అడుగంటుతున్న సాగర్
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ, మార్చి 23: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఏప్రిల్ 15 వరకు నిరంతరాయంగా నీటి విడుదల చేసి ఎడమకాల్వ కింద రబీలో సేద్యం చేసిన వరిపంటలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగర్ జలాశయం అడుగంటిపోయి 50 సంవత్సరాల చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులలో ముందుచూపు లేకపోవడం వలనే ఈ దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. కర్నాటక, మహారాష్టల్రోని ప్రాజెక్టుల ఎత్తు పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు సమృద్ధిగా రావడంలేదన్నారు. దామాషా పద్ధతిలో కృష్ణా నీటి పంపకాలు జరపాలని డిమాండ్ చేశారు. పవర్ ఉత్పత్తికి నీటి వాడకాన్ని నిలిపివేయాలని కోరారు. శ్రీశైలం నుండి నీటిని సాగర్‌కు విడుదల చేయించి ఆయకట్టు కింద సేద్యం చేసిన పంటలను కాపాడాలని ఆయన కోరారు. ఎడమకాల్వ పరిధిలోని మేజర్ల కింద రబీలో సేద్యం చేసిన వరి పంటలకు నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారబంది పద్ధతిన నీటి విడుదల చేయడం వలన ఎండలకు నీరు ఆవిరై వరి పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావుల నుండి కూడా నీరు రావడంలేదని ఆయన అన్నారు. వరి పంటలను రక్షించేందుకుగాను వారబంది పద్ధతిని ఎత్తివేసి నిరంతరాయంగా ఏప్రిల్ 15వరకు నీటి విడుదల చేసి పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు లేక రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారని, ఈసంవత్సరం కురిసిన వర్షాలకు ఖరీఫ్‌లో పంటలు సేద్యం చేసినా సరైన దిగుబడిరాక రైతులు నష్టపోయారన్నారు. రబీలో సేద్యం చేసిన వరిపంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కందులు, మిర్చి పంటలకు సరైన ప్రభుత్వ మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. వరి ధాన్యాన్ని, కందులను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్ పాండు, సిపిఎం నాయకులు జగదీశ్ఛంద్ర, మహ్మద్‌బిన్‌సయిద్, రామ్మూర్తి, గాదె పద్మమ్మ, పాదూరి శశిధర్‌రెడ్డి, వేముల రాంరెడ్డి ఉన్నారు.

ఎస్సెసీ పరీక్షా పత్రాలకు
జవాబులు రాసిన కేసులో 12 మంది అరెస్టు
* పరారీలో మరికొందరు పెద్ద చేపలు

హుజూర్‌నగర్, మార్చి 23: ఎస్సెసీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నుండి సెల్‌ఫోన్‌ల ద్వారా ప్రశ్నాపత్రాలు సేకరించి వాటికి జవాబులు రాసి అందిస్తున్న కేసులో పట్టణంలోని తనూజ, విజ్ఞాన్, చైతన్య కళాశాలకు చెందిన 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు ఎస్‌ఐ జి రంజిత్‌రెడ్డి చెప్పారు. గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. బానోత్ ప్రసాద్ అనే వ్యక్తి బుధవారం సెల్‌ఫోన్ కెమెరాతో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీయటం వాట్సాప్‌లో కొందరికి పంపండం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రాలను ఫొటో తీసిన అనంతరం తనూజా, ఓం శాంతి నికేతన్ పాఠశాలలోని మొదటి అంతస్తు గదిలో కూర్చొని ప్రశ్నాపత్రాలకు జవాబులు రాస్తూ రెండు ప్రైవేటు పాఠశాలలు, మరో ప్రైవేటు జూనియర్ కాలేజీకి చెందిన 12 మంది పట్టుబడ్డారని తెలిపారు. అందులో బానోత్ ప్రసాద్, షేక్ సైదులు, గుగులోతు గోపినాయక్ తనూజా పాఠశాలకు చెందిన వారు కాగా చిచ్చుల శరత్, బానోత్ సైదా, చైతన్య జూనియర్ కళాశాల, భూక్యా సాయిరామ్, షేక్ ఖలీల్‌బాబా, ఓం శాంతినికేతన్, విజ్ఞాన్ యాజమాని కొత్తా శ్రీనివాసరావు, పోలె వెంకట్ తదితరులు ఉన్నారని ఎస్‌ఐ చెప్పారు. ఈనెల 21 రాత్రి వీరంతా సమావేశమై ఎలాగైనా ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం బయటకు తీసుకరావాలని ఒక పథకం రూపొందించారని విచారణలో తేలిందని పేర్కొన్నారు. కాగా, వివియం పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు, మరో పాఠశాలకు చెందిన ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకుని రిమాండ్ చేస్తామని చెప్పారు. బానోత్ ప్రసాద్ తమ్ముడు వివియం పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు మంచిగా రాయటం లేదని ప్రసాద్‌ను ఉసిగొలిపి ఎలాగైనా మీ తమ్ముడి నుండి పరీక్షా పత్రాన్ని సెల్‌ఫోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీయించి బయటకు తెచ్చి తనూజా పాఠశాలకు తీసుకరావాలని, అక్కడ జవాబులు రాసి ఆరూరి రవి జిరాక్స్ సెంటరులో జిరాక్స్‌లు తీయించినట్లు తేలిందని అన్నారు. 9గంటల 50 నిమిషాలకు వివియం పాఠశాల వద్దకు బానోత్ ప్రసాద్ వెళ్లి తమ్ముని వద్ద నుండి సైగల ద్వారా ప్రశ్నాపత్రాన్ని కిటికీ నుండి కెమెరాలో బంధించారని తాము ప్రశ్నాపత్రంపై ఉన్న హాల్ టికెట్ నెంబరు గురించి సూర్యాపేట డిఇఓకు, ఇతర అధికారులకు తెలిపామని ఎస్‌ఐ చెప్పారు. సెల్‌ఫోన్‌ను పరిశీలించి చూడగా ఆ గదిలో ఉన్న షేక్ ఖలీల్‌బాబా, పోలె వెంకటేశ్వర్లు, కొమ్ము శ్రీనులు మరో 2 సెల్‌ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించినట్లు గుర్తించామన్నారు. ఈ విషయాన్ని వారి నుండి పూర్తి సమాచారం రాబట్టి డిఇఓకు తెలిపామని పేర్కొన్నారు. ఈ మేరకు డిఇఓ విచారణ చేసి ఇన్విజిలేటర్, చీఫ్, సిసిడిఓలపై తమకు ఫిర్యాదు చేశారని అన్నారు. తుది నివేదిక అనంతరం ఉపాధ్యాయులను, పరారీలో ఉన్న వారిని గుర్తించి రిమాండ్ చేస్తామని ఎస్‌ఐ చెప్పారు.

దళారుల కందుల పట్టివేత
చండూరు, మార్చి 23: చండూరు కందుల కొనుగోలు కేంద్రంలో దళారులు తీసుకొచ్చిన కందులను అధికారులు గురువారం పట్టుకున్నారు. గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామానికి చెందిన కజ్జం దయాకర్‌కు చెందిన ట్రాక్టర్‌లో అదే గ్రామానికి చెందిన ఓరుగంటి పద్మాకర్, లింగన్నపాడు గ్రామానికి చెందిన నాగులవంచ కిషన్ రావు స్థానికంగా రైతులు వద్ద కొనుగోలు చేసిన కందులు ఇరవై ఒకటిన్నర క్వింటాళ్లు చండూరు మార్కెట్ యార్డులోని కందుల కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఏసిఎస్‌వో కేశన్న, చండూర్ సివిల్ సప్లై డిటి ఆంజనేయులు చండూరు కొనుగోలు కేంద్రం వద్ద మాటువేసి సదరు కందులను, ట్రాక్టరును పట్టుకున్నారు. తదానంతరం పంచనామ నిర్వహించి వారిపై 6ఎ కేసును నమోదు చేశామని తెలిపారు. ఈ కందులను భద్రపరిచే పనిలో భాగంగా చండూరు మార్కెట్ యార్డులోని గోపికృష్ణ ట్రేడర్స్ యజమాని తేలుకుంట్ల జానయ్యకు అప్పగించారు. సదరు ట్రాక్టరుపై చండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ట్రాక్టరును స్టేషన్‌కు అప్పగిస్తామని, తదుపరి చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్‌కు నివేదికను అందజేయనున్నట్లు ఎసిఎస్‌వో శేషన్న తెలిపారు. ట్రాక్టర్ ఇంజన్‌కు ట్రాలీకి రిజిష్ట్రేషన్, డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడం గమనార్హం.