నల్గొండ

యజ్ఞంలా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 24: మొక్కలు నాటి సంరక్షించకపోతే జీవకోటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారనున్నదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రీన్ డే కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామంలోని వ్యవసాయ మార్కెట్‌లో మొక్కలను నాటి నీరు పోసిన అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 33 శాతం ఉండాల్సిన అడవులు రాష్ట్రంలో 24 శాతానికి పడిపోయాయని, జిల్లాలో 6శాతం మాత్రమే అడవులు ఉన్నాయన్నారు. అడవులు అంతరించిపోయినట్లయితే సకల జీవికోటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. సర్పంచ్ నుండి పార్లమెంట్ సభ్యుని వరకు కంకణబద్ధులై హరితహార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు మండలానికి ఒక అధికారిని నియమించడంతోపాటు గ్రామస్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటుచేసి మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో 2.25లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, జూన్‌లో వర్షాలు కురిసినట్లయితే మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం యజ్ఞంలా చేపడుతుందని అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి అనంతయ్య, తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, జిల్లా అటవిశాఖ అధికారి శాంతారావు, ఎంపిడిఓ వెంకట్‌రెడ్డి, ఎంపిపి ఒగ్గు జానయ్య, జడ్పీటిసి నాగలక్ష్మీ, వైస్ ఎంపిపి సరళ, నాయకులు యాదగిరిరెడ్డి, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, షహనాజ్‌బేగం, మార్కెట్ సిబ్బంది వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.