నల్గొండ

ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, మార్చి24: రాష్ట్రంలో ఖాళీగా ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపిడివో కార్యాలయంలో బొమ్మల రామారం, బీబీనగర్ టిఎన్జీవో ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పనిభారం ఎక్కువై అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తుందని అన్నారు. అదేవిధంగా ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టిఎన్జీవో జిల్లా కన్వినర్ జగన్మోహన్ ప్రసాద్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుము భగత్, ఆర్‌ఐ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ కిషన్‌రావు, సూపరింటెండెంట్ పూర్ణచందర్‌రావు, సబ్ రిజిష్టర్ కార్యాలయ సీనియర్ అధికారి గోపి, సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
దొనిపాములలో విషజ్వరాలు
చండూరు, మార్చి 24: మండల పరిధిలోని దోనిపాముల గ్రామంలో గత వారం రోజులుగా గ్రామ ప్రజలు విషజ్వరాలతో మంచం పట్టారు. శుక్రవారం మండల వైధ్యాధికారి గ్రామంలో క్యాంపు నిర్వహించి 60 మందిని పరీక్షించగా 16 మందికి టైఫాయిడ్ వచ్చినట్లు గుర్తించామన్నారు. వీరికి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ఎంపిడివో శైలజ పర్యావేక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, విఆర్‌వో నర్సిరెడ్డి, వైద్య సిబ్బంది, తదితరుల పాల్గొన్నారు.
నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
మునుగోడు, మార్చి 24: మండల కేంద్రంలోని వాగు నుండి అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లలను స్థానిక పోలిసులు శుక్రవారం పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను ఠాణాకు తరలించి సదరు ట్రాక్టర్లపై వాల్టా కేసును నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. అనుమతి లేకుంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించమని ఎస్సై హెచ్చరించారు.
తండ్రికి పిండప్రదానానికి వచ్చి
కొడుకు అనంత లోకానికి..
దామరచర్ల, మార్చి 24: కన్న తండ్రికి ఆత్మశాంతి చేకూరాలని సంవత్సరిక పిండప్రదానం చేయడానికి ఇతర దేశంలో ఉన్న కొడుకు స్వదేశానికి వచ్చి అనంత లోకానికి వెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద గల కృష్ణా,మూసి నదుల సంగమం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు గత సంవత్సరం మృతిచెందగా ఆయన కుమారులైన ఇల్లెందుల అనిల్‌కుమార్(38), ఇల్లెందుల పవన్‌కుమార్‌లు భార్య స్వరాజ్యలక్ష్మీలు సంవత్సరిక పిండప్రదానం కోసం మండలంలోని వాడపల్లి వద్ద గల కృష్ణా, మూసీ నదుల సంగమంలో పిండప్రదాన కార్యక్రమం చేసేందుకు రాగా పూజా కార్యక్రమాలు ముగించుకోని సంగమం ప్రాంతంలో పిండాలను కుమారులు అనిల్‌కుమార్, పవన్‌కుమార్‌లు నదిలోకి వదిలే క్రమంలో ఇద్దరు నదిలోకి మునిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న పడవ నడుపుతున్న సోమయ్య ఇది గమనించి పవన్‌కుమార్‌ను నదిలో నుంచి బయటకు లాగగా అనిల్‌కుమార్ నీటిలో పూర్తిగా మునిగిపోయి గల్లంతయ్యాడు. వెంటనే పడవలు వేసుకోని నదిలో వెతకగా అనిల్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు సౌతాఫ్రికాలోని జోహన్నిస్‌బర్గ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుని బందువుల ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి ఎస్‌ఐ రామన్‌గౌడ్ తెలిపారు.