నల్గొండ

ప్రజాస్వామ్యంపై టిఆర్‌ఎస్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 24: ప్రజాసమస్యలపై ఆందోళనలు, ధర్నాలు చేయకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, పౌరహక్కులపై దాడికి పాల్పడుతుందని ప్రభుత్వ దమననీతిని ప్రజలు గమనిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఆ పార్టీ మాజీ శాసన సభ పక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిపిఎం జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతుర ఇందిరాపార్కు వద్ధ ధర్నా చౌక్‌ను ఎత్తివేసి, ప్రతిపక్షాలు నిర్వహించే ఆందోళనలకు అనుమతులివ్వకుండా ముందస్తు అరెస్టులకు పాల్పడుతు కెసిఆర్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మేడి పండు చందంగా ఉందని వృత్తిదారులను ఆకర్షించేందుకు భారీ కేటాయింపులు చూపిందని గత బడ్జెట్‌లలో చేసిన కేటాయింపుల్లో 50శాతం కూడా ఖర్చు చేయని ప్రభుత్వం కేటాయింపులతో జనాన్ని మోసం చేస్తుందన్నారు. బడ్జెట్ హామీలకు ఆదాయ వనరులు ఏమిటో ప్రభుత్వంపై స్పష్టం లేదన్నారు. ఎన్నికల హామీలు దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్‌లు, ఎస్‌ఎల్‌బిసి, డిండి ఎత్తిపోతల పనులపై హామీలన్ని అపరిష్కతంగానే ఉన్నాయన్నారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కందుల కొనుగోలులో వైఫల్యం చెందిందని, రబీ ధాన్యం కొనుగోలునైనా సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టులో మార్చి 31వరకే కాకుండా ఏప్రిల్ 15వరకు నీటి విడుదల జరిపి వరి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. మార్చి 31వరకే నీటి విడుదల నిలిపివేతను నిరసిస్తు ఈ నెల 27న మిర్యాలగూడ ఎనె్నస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్న ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. సమావేశానికి ముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తిరందాసుగోపికి సంతాపం ప్రకటించారు. సమావేశంలో సిపిఎం నాయకులు పి.అనంతరామశర్మ, తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేశం, రైతు సంఘం నాయకులు బండ శ్రీశైలం, వి.వెంకటేశ్వర్లు, కె.నాగిరెడ్డి, జగదీష్‌చంద్ర, కె.శ్రీనివాస్, శశీధర్‌రెడ్డి, పాపానాయక్‌లు ఉన్నారు.
సాగర్ నీటి విడుదలకై కలెక్టర్‌కు వినతి
నాగార్జున సాగర్ ఎడమకాలువ రబీ వరి పంటల పరిరక్షణకు మార్చి ఏప్రిల్ 15వరకు కూడా నీటి విడుదల చేయాలని సిపిఎం జిల్లా కమిటీ శుక్రవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వినతి పత్రం అందించింది. మార్చి 31తో వారబందీ పద్ధతిలో నీటి విడుదల ముగిసిపోతుందని అయితే పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ 15వరకు నీటి విడుదల చేయాలని సిపిఎం కోరింది. జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండ శ్రీశైలంలు ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.