నల్గొండ

ఈవిఎంల గోదాంల నిర్మాణాలకు ప్రతిపాదనలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 25: తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాల్లో ఈవిఎంల గోదాంల నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచించారు. శనివారం ఆయన కలెక్టర్లు, జెసిలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈవిఎంల గోదాంలను తనిఖీ చేసి అవసరమైన చోట రిపేర్లు చేయించాలన్నారు. స్పెషల్ సమ్మర్ రివిజన్-2017, ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ ఇన్ అర్భన్ ఏరియా ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాల ఎన్నికల అధికారులు బూత్ లెవల్ అధికారులు, పర్యవేక్షకులను సంబంధిత ఈఆర్‌వో ప్రతిపాదనల మేరకు నియమించాలన్నారు. వివిధ పార్టీల సమావేశం నిర్వహించి బూత్ లెవల్ ఎజెంట్లను నియమించాలని సూచించాలన్నారు. దీనిపై నివేదికలు పంపించాలన్నారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను తీసుకోవాలన్నారు. జెసి సి నారాయణరెడ్డి మాట్లాడుతూ బూత్ అధికారులను నియమించామని సూపర్‌వైజర్ల నియామకం చేపడుతామని, పార్టీలతో సమావేశాలు జరుపుతామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో ఖిమ్యానాయక్, ఆర్డీవో వెంకటాచారి, కమిషనర్ రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
* పోలీస్, న్యాయ సిబ్బందికి జిల్లా జడ్జి, ఎస్పీల పిలుపు

నల్లగొండ, మార్చి 25: నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు ప్రక్రియలలో నూతనంగా వస్తున్న చట్టాలు, దర్యాప్తులో వినియోగిస్తున్న ఆధునాతన పద్ధతులపై పోలీస్, న్యాయశాఖల సిబ్బంది అవగాహన కల్పించుకోవాలని జిల్లా జడ్జి డి.తిరుమలరావు, ఇన్‌చార్జి ఎస్పీ పరిమళలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్ అధికారులకు, న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నూతన ఇనె్వస్టిగేషన్ చట్టాలు, పద్ధతులపై ఆకళింపు చేసుకుని వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు అందుకోవాలన్నారు. మహిళా సంరక్షణ, బాలల సంరక్షణ చట్టాల్లో వచ్చిన మార్పులపై అవగాహాన చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల చట్టాలు, ఇనె్వస్టిగేషన్ చట్టాల్లో వచ్చిన మార్పులను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

మీ సేవలు టిఎస్‌టిఎస్‌లోకి..
* టిఎస్‌టిఎస్ సీనియర్ ఇంజనీర్ సత్యనారాయణ మూర్తి
నార్కట్‌పల్లి, మార్చి 25: రాష్ట్రంలో నడుస్తున్న మీసేవ కేంద్రాలు ఇకపై టిఎస్‌టిఎస్ సర్వీసులోకి మార్చుతున్నట్లు టిఎస్‌టిఎస్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో మీ సేవ యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 213 మీ సేవ కేంద్రాలు ఉన్నాయన్నారు. నిర్వాహకులు ఇకపై టిఎస్‌టిఎస్ సౌకర్యాలతో వినియోగదారులకు సేవలు అందిస్తారన్నారు. సమావేశంలో మీసేవ ప్రాజెక్ట్ ఇంజనీర్ కమిషనర్ దత్తాత్రేయ ఫణి, ప్రోగాం ఆఫీసర్లు కె రవికుమార్, జిల్లా మేనేజర్ సైదానాయక్, దుర్గారావు, పరిశీలకులు గఫార్, ధనుంజయ, బాబు, సంతోష్ పాల్గొన్నారు.