నల్గొండ

ప్రశ్నాపత్రం లీకేజిలో మరి కొందరు అదుపులోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మార్చి 25: పట్టణంలోని విజయ విద్యా మందిర్‌లో నుండి 10వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజి కేసులో పరారీలో ఉన్న 1 ఎయిడెట్ పాఠశాలకు చెందిన, 2 ప్రైవేటు పాఠశాలలకు చెందిన మరో ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని తనూజా, ఓం శాంతినికేతన్, విజ్ఞాన్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, చైతన్య జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు, ఓ జిరాక్స్ సెంటర్ యాజమానితో సహా 12 మందిని పోలీసులు రిమాండ్‌కు పంపగా వారికి బెయిల్ లభించలేదు. ప్రశ్నాపత్రాన్ని సెల్‌పోన్ ద్వారా పోటోలు తీసిన శాంతినికేతన్ పాఠశాల వార్డెన్ బానోత్ ప్రసాద్ కూడా ఇప్పటికి పరారీలో ఉన్నాడు. మరికొన్ని ప్రైవేటు పాఠశాలకు చెందిన పెద్ద చేపలు కూడా పట్టణంలో కన్పించకుండా హైద్రాబాద్, నల్లగొండ ప్రాంతాలలో మకాం వేసినట్లు తెలుస్తున్నది. బానోత్ ప్రసాద్ తన సెల్‌ఫోన్ వాట్సాప్ ద్వారా ఏడుగురికి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం పంపినట్లు ఆధారాలు కనుగొన్నారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే పోలీసులకు పట్టుబడ్డారు. వివియం సెంటరులో పనిచేస్తున్నా మరో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు ఇంతకు ముందు ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల నుండి విచారణ ద్వారా సమచారం వచ్చాకనే పూర్తి వివరాలు, అసలు ఈ పథకం రూపొందించిన వారు ఎంత మంది అనే విషయం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. స్థానిక ఎస్‌ఐ జి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎస్‌సి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని వివరాలు ఆదివారం తెలియచేస్తామన్నారు.