నల్గొండ

నంది ఆకారంలో గేదెకు పుట్టిన దూడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 26: మిర్యాలగూడ పట్టణం ఈదులగూడలో చింతల వెంకటేశ్వర్లు అనే పాడి రైతు ఇంట ఆదివారం పాడిగేదెకు నంది ఆకారంలో దూడ పుట్టింది. దూడ పుట్టగానే చనిపోయింది. వెంకటేశ్వర్లు ఇంటిని సందర్శించిన పశుసంవర్దకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జూలకంటి వెంకట్‌రెడ్డి జన్యు లోపం వల్లనే నందిలా దూడ ఉందని అన్నారు. పాడి గేదె గర్భంతో ఉన్నప్పుడు సరైన వైద్యం అందిస్తే ఇలాంటివి జరగవని ఆయన అన్నారు. వింత దూడ పుట్టిందన్న ప్రచారంతో పలువురు గుంపులుగా వచ్చి చూసి వెళ్లారు.
వంచన చేసిన ప్రియుడు
కట్టంగూర్, మార్చి 26: ప్రేమించానని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియునితో తనకు వివాహం జరిపించాలని డిమాండ్‌చేస్తూ ప్రియురాలు ప్రియుని ఇంటి ముందు దీక్షకు దిగిన సంఘటన ఆదివారం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. బాధితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన మాదగోని చంద్రయ్య కుమార్తె శిరీష, అదే గ్రామానికి చెందిన కానుగు శ్రీకాంత్‌లు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురు కుటుంబసభ్యులకు తెలియగా శ్రీకాంత్ శిరీషను మరో వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపడంతో శిరీష కుటుంబసభ్యులు గత కొన్ని నెలల క్రితం నల్లగొండ మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తాను శిరీషను ప్రేమిస్తున్నానంటూ పెళ్లి కుదుర్చుకున్న యువకునికి ఫోన్‌లు చేసి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని కుదుర్చుకున్న వివాహాన్ని రద్దుచేసుకున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో తాను శిరీషను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఒప్పందం కుదుర్చుకొని రెండు మాసాలు గడుస్తున్న పెళ్లి ఊసెత్తలేదు. గత కొన్నిరోజుల క్రితం శ్రీకాంత్ గ్రామంలో జరిగిన స్నేహితుని వివాహానికి రాగా శిరీష కుటుంబసభ్యులు వివాహం చేసుకోవాలని కోరగా శ్రీకాంత్‌తో పాటు తల్లిదండ్రులు వివాహం చేసుకునేది లేదని, మీరు ఏమిచేసుకుంటారో చేసుకొండని చెప్పడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు తాము ఫిర్యాదుచేసిన పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీక్ష చేపట్టిన శిరీషకు మద్దతుగా గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. అదే విధంగా సూర్యాపేటకు చెందిన మహితా మహిళా సంఘం సభ్యులు మద్దతు పలికారు. ప్రేమించి మోసంచేసిన శ్రీకాంత్‌తో శిరీష వివాహం జరిపించేంత వరకు తాము ఆందోళన విరమించేది లేదన్నారు.
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్
రామన్నపేట, మార్చి 26: ఆలిండియా జాతీయస్థాయి అధ్లెటిక్ పోటీలకు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుక్కడపు రమేష్ ఎన్నికయ్యారు. మండలంలోని దుబ్బాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రమేష్ ఈనెల 29 నుండి 31వరకు దేశరాజధాని ఢిల్లీలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరుపున ఆయన పాల్గొననున్నాడు. మండలంలోని మునిపంపుల గ్రామానికి చెందిన రమేష్ గతంలో 2010లో హర్యానా, 2012లో భోపాల్, 2016లో పూణెలలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో ఆయన రాష్ట్ర జట్టుతరపున పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన రమేష్‌ను ఎంఈవో దుర్గయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫరీదుద్దిన్, మెరా అద్యక్షుడు పెద్ది సుధాకర్, పాత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఏసిబి డిఎస్పీ మిర్యాల ప్రభాకర్ తదితరులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందించారు.