నల్గొండ

సామాజిక వికాసానికి నాటకం చైతన్య సాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 26: తెలంగాణ సామాజిక వికాసానికి, ప్రజా చైతన్యానికి నాటక రంగం చైతన్య సాధనగా ఉపకరించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సంస్కృతిక శాఖ, కోమలి కళా సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో ఏప్రిల్ 1వరకు రాష్ట్ర నాటక సప్తాహం పేరుతో నిర్వహిస్తున్న నాటకోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ గ్రామీణ ప్రజల్లో, నిరక్షరాస్యుల్లో ఆనాది నుండి కూడా నాటకం ఆలోచనను, చైతన్యాన్ని రగిలించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. దేశ స్వాతంత్య్ర సాధనలో, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో సైతం ప్రజలను కదిలించడంలో నాటకం చైతన్య శక్తిగా పనిచేసిందన్నారు. సినీమా, టివి మాద్యమాల విస్తృతితో ఆదరణ కోల్పోతున్న నాటక రంగ పరిరక్షణకు, పూర్వవైభవ కల్పనకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటునందించేందుకు రాష్ట్ర నాటక సప్తాహం నిర్వహిస్తుందన్నారు. ఈ నాటక సప్తాహం ద్వారా మరోసారి రాష్ట్ర నాటక రంగ కళాకారులు తమ కళా ప్రదర్శనలతో నాటక రంగాన్ని నిలబెట్టాలన్నారు. నల్లగొండలో సాంస్కృతిక కళా ప్రదర్శనలకు భారీ ఆడిటోరియం మంజూరు చేయిస్తామన్నారు. విద్యార్ధిని, విద్యార్థులను కనుమరుగువుతున్న నాటక రంగం వంటి కళల్లో ప్రోత్సహించాలన్నారు. తొలి రోజు నల్లగొండ రసరమ్య కళా రంజని బృందం ఉషా పరిణయం పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, కోమలి కళాసమితి నిర్వాహకులు బక్క పిచ్చయ్య, పున్న అంజయ్య, చిన వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల అండతో సభ్యత్వం జోరు పెంచాలి
* 6నుండి సంస్థాగత కమిటీల ఎన్నికలు
* మండలి డిప్యూటీ చైర్మన్ నేతి, ఎమ్మెల్సీ కర్నే

నల్లగొండ, మార్చిర 26: సీఎం కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాల అండతో టిఆర్‌ఎస్ శ్రేణులు పార్టీ సభ్యత్వ నమోదును పెంచాలని మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌లు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించి అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం 30వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం హాయంలో లేని విధంగా బడ్జెట్‌లో వృత్తిదారులకు భారీగా నిధులు కేటాయించిందన్నారు. కెసిఆఱ్ పాలన పట్ల లభిస్తున్న ప్రజాదరణను అనుకూలంగా మార్చుకుని సభ్యత్వ నమోదు పెంచాలని వారు కోరారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఈ ఏప్రిల్ 6నుండి ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 6న గ్రామ కమిటీలు, 12,13తేదిల్లో మండల కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాదిగా ప్రజలను కదిలించాలన్నారు. పార్టీ అధినేత కెసిఆర్ పిలుపు మేరకు శ్రమదానంతో బహిరంగ సభ నిర్వాహణ ఖర్చుల సేకరణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నరసింహరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఫరిదుద్ధిన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అబ్బగోని రమేశ్, బకరం వెంకన్న, ఖరీంపాషా, మండల పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.