నల్గొండ

మాయమాటలతో అధికారం కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మార్చి 26: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు మాయామాటలను చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకివచ్చారని అధికారాన్ని చేపట్టాక ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకాపర్తి గ్రామపరిధిలోని బోయగుబ్బలో ఆదివారం వాటర్‌ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చిన్నకాపర్తిలో గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌పై మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలపై సంచలన వ్యాఖ్యలను చేశారు. పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ ఎంపిలేనని తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా నేటి వరకూ నెరవేర్చకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మాయమాటలతో ప్రచారార్భాటాలే తప్ప ప్రభుత్వం చేసిందేమి లేదని, చెప్పేదొకటి చేసేదొకటిలా ఉన్నదని కోమటిరెడిడ రాజశేఖర్ రెడ్డి కెసిఆర్‌పై మండిపడ్డారు. తెరాసి కుటుంబ పార్టీలో వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. కుటుంబ సభ్యులకే మంత్రి పదవులు కట్టబెట్టారని, అంతే కాకుండా తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన టిజెఎసి చైర్మన్ ప్రొ. కోదండరాం ను కెసిఆర్ ద్రోహిగా చిత్రీకరిస్తున్నాదని ఇంతకంటే అన్యాయం మరొకటి లేదన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీధిరౌడిలా ప్రవరిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని ఆయనపై చిరుమర్తి లింగయ్యను పోటీకి దింపితే సిఎం కెసిఆర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా వీరేశం గెలువలేడని చిరుమర్తి ఇంట్లో కూర్చున్నా లక్ష ఓట్ల మెరజార్టీతో గెలుస్తారన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సిఎం కెసిఆర్ చెప్పింది చేయడం ఆయనకు వ్యక్తిగత సేవలు చేయడం తప్ప ఆయనకు ఎలాంటి అధికారం లేదన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణఇచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. రాబేయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అందరు గుర్తుంచుకోవాలన్నారు.

కనుమరుగవుతున్న ప్రతిపక్షాలు
* వచ్చే ఎన్నికల నాటికి మిగిలేది టిఆర్‌ఎస్ ఒక్కటే: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట, మార్చి 26: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న తరహా అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే మిగలనుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎరుగని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును కేవలం మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతూ సంక్షేమ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో తెలియజెప్పారన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను చూసి ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులు చెల్లించి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి భవిష్యత్ ఉండదని భావించడంతో పాటు ప్రభుత్వ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. గతంలో పనిచేసిన రాజకీయ పార్టీల్లో నాయకులను కార్యకర్తలను జెండాలను మోయించి ఘర్షణలు, హత్యలతో రక్తచరిత్రను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. అందువల్లే ఏ గ్రామానికి వెళ్లిన రోడ్ల పక్కన సమాధులు, స్మారకస్థూపాలే దర్శనమిస్తున్నాయన్నారు. కానీ అందుకు భిన్నంగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇస్తున్న సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి పదవులు కట్టబెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, పెన్‌పహాడ్ జెడ్పీటిసి పినె్నని కోటేశ్వర్‌రావు, పార్టీ నాయకులు కట్కూరి గన్నారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్, నెమ్మాది భిక్షం, మండారి నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్తాళపురం, ఏనుబాముల, దోసపహాడ్ సర్పంచ్‌లతో పాటు పలువురు వార్డుసభ్యులు, వివిధ పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు.