నల్గొండ

కలెక్టరేట్ ముందు కమ్యూనిస్టుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 27: సిఎం కెసిఆర్ ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తు సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఆ పార్టీ శ్రేణులు కలెక్టరేట్‌ల ముట్టడి నిర్వహించి ధర్నాతో నిరసన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావులు మాట్లాడుతూ ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్‌లు, తండాలకు పంచాయతీల హోదా, కెజి టూ పిజి ఉచిత విద్య అంటు అనేక హామీలిచ్చి నేడు ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయకుండా మాయమాటలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంతో జిల్లాలోని డిండి, ఎస్‌ఎల్‌బిసి సొరంగం, బి.వెల్లంలప్రాజెక్టులు నేటికి అసంపూర్తిగానే మిగిలయాన్నారు. పాత హామీలను విస్మరించి కొత్తగా బడ్జెట్‌లో వృత్తిదారులకు భారీ కేటాయింపులంటు అంకెల గారడీతో మరో మోసం చేస్తున్నారన్నారు.
పెండింగ్ ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులపై నిర్లక్ష్యం చేస్తు మరోవైపు సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాపై వ్యక్తమవుతున్న నిరసనకు జడిసి ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను ఎత్తివేస్తు ప్రజాందోళనలపై అణిచివేతకు పాల్పడుతుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు నెల్లికంటి సత్యం, కె.కాంతయ్య, ఎల్.శ్రవణ్, పబ్బు వీరస్వామి, బి.వెంకటరమణ, బంటు వెంకటేశ్వర్లు, రామచంద్రం, చాపల శ్రీను, టి.వెంకటేశ్వర్లు, పరంగి రాము, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

నేరెడుగొమ్ము ఆశ్రమ పాఠశాల
హెచ్‌ఎం సస్పెన షన్
దేవరకొండ, మార్చి 27: నేరెడుగొమ్ము ఆశ్రమపాఠశాల హెచ్ ఎం విజయరాణిపై సస్న్షెన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా గిరిజన సంక్షేమాధికారి నరోత్తంరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేరడుగొమ్ము ఆశ్రమపాఠశాలలో హెచ్‌ఎం విజయరాణి భర్త రాజు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించడంతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పాఠశాలలో విచారణ జరిపి హెచ్‌ఎం భర్త రాజు లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారించి రెండు రోజుల క్రితం నేరెడుగొమ్ము పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏటిడబ్ల్యువో పాండునాయక్ విచారణ జరిపి బాలికలు ఉండే ఆశ్రమపాఠశాలలోకి హెచ్‌ఎం తన భర్తను అనుమతించడం వల్లే సమస్య వచ్చిందని గుర్తించి జిల్లా డిటిడబ్ల్యువోకు నివేదిక పంపారు. ఏటిడబ్ల్యువో ఇచ్చిన నివేదిక మేరకు జిల్లా గిరిజన సంక్షేమాధికారి నరోత్తంరెడ్డి హెచ్‌ఎం విజయరాణిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెల్దేవర్‌పల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న భాగ్యలక్ష్మిని నేరెడుగొమ్ము ఆశ్రమ పాఠశాల హెచ్ ఎంగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
రాజుపై ఫోక్సా చట్టం కింద కేసు
నేరెడుగొమ్ము ఆశ్రమపాఠశాల హెచ్ ఎం విజయరాణి భర్త రాజుపై ఫోక్సా చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు రూరల్ సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపి రాజు పై ఫోక్సా చట్టం క్రింద కేసు నమోదు చేసి నిందితుడు రాజును అరెస్ట్ చేశామని సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు.