నల్గొండ

భూసేకరణకు ప్రభుత్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మార్చి 27: భూమి లేని నిరుపేద వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు పంపిణికై భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పేద, దళిత కుటుంబాల అభ్యున్నతికి పెద్ద మనస్సుతో రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాగు యోగ్యమైన భూములను విక్రయించాలని భావించే రైతులు సంబంధిత తహశీల్దార్‌లు, ఆర్డీవోలను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని కుడకుడలో ఉన్న ఎస్సి అభివృద్ది అధికారి కార్యాలయంలోను తమ ఆసక్తిని తెలియపర్చవచ్చునని సూచించారు. రైతులు తమ భూముల ఆధారలతో సంప్రదిస్తే పక్షం రోజుల లోగా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలు, మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకొని రైతులు విక్రయించనున్న భూములకు జెసి, ఆర్డీవో, వ్యవసాయ అధికారి, తహశీల్దార్, భూగర్భ జల శాఖ, రిజస్ట్రేషన్ అధికారుల కమిటీ సంబంధిత రైతులతో చర్చించి ధరలను నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.

హామీల అమలుకు మరో ఉద్యమం
జూలై 30న లక్ష మందితో రాజధానిలో బహిరంగ సభ * ఎల్‌హెచ్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్
సూర్యాపేట, మార్చి 27: ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుకోసం లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ చెప్పారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పద్మశాలి భవన్‌లో జరిగిన సంఘం జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల రాష్టస్థ్రాయి సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్న నేటికి సిఎం కెసిఆర్ గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీని సైతం అమలుచేయలేదని మండిపడ్డారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు కుంటి సాకులతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా తండాలను పంచాయతీలుగా మారుస్తానన్న హామీ కూడా ప్రకటనలకే పరిమితమైందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా జూలై 30న లక్ష మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం జాతీయ కోశాధికారి సపావట్ హన్మంత్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కోట్యానాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ భిక్షంనాయక్‌లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, అనుబంధాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.