నల్గొండ

వచ్చే ఏడాది నుండి రెండు పంటలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మార్చి 28: ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో వచ్చే ఏడాది నుండి రెండు పంటలకు నీరు అందిస్తామని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు ఏమి జరగాలని కోరుకున్నారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా అందరి కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండల టిడిపి అధ్యక్షుడు జూలకంటి వెంకట్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది కార్యకర్తలతో మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన నాయకులకు టిఆర్‌ఎస్ కండువాలు కప్పి మంత్రి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన, అన్ని వర్గాల సమస్యలను తెలిసిన కెసిఆర్‌కు పట్టం కడితే తమ బతుకులు మారుతాయని భావించి ప్రజలు ఎన్నికల్లో గెలిపించారన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూర్చేందుకు అనేక పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రతిక్షణం తెలంగాణ ప్రజల జీవితాలను ఎలా మార్చాలి, తెలంగాణను బంగారు తెలంగాణగా ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనలోనే ఉంటుంన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయడంతో పాటు హామీలు ఇవ్వకుండానే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీల నుండి గెలుపొందిన ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్‌ఎస్‌కే ప్రజాధరణ ఉందన్న భావనతో స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల ప్రజలు పార్టీ సభ్యత్వాలను స్వచ్చందంగా ముందుకు వచ్చి స్వీకరిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాల్లో పూర్తిస్థాయిలో బిటి, సిసిరోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకే కుటుంబంగా భావించి ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత మండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహరెడ్డి, పెన్‌పహాడ్ జడ్పీటిసి పినె్నని కోటేశ్వర్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు కట్కూరి గన్నారెడ్డి, మిర్యాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, పోలేబోయిన నర్సయ్యయాదవ్, సముద్రాల రాంబాబు, ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టిడిపికి చెందిన మాజీ ఎంపిపి నల్లపు శ్రీను, నాయకుడు జూలకంటి రాజశేఖర్‌రెడ్డి, మోనంపాటి పెద్ద వెంకట్‌రెడ్డి, గడ్డం సైదులు, బొల్లం సైదులు, జుట్టుకొండ రామలింగయ్యతో పాటు పలువురు నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.