నల్గొండ

శ్రీరామనవమికి రామగిరి ఆలయం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 4: శ్రీరామనవమి వేడులకు జిల్లా కేంద్రం నల్లగొండ రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సకల హంగులతో ముస్తాబైంది. ఉత్సవాల్లో భాగంగా నేడు రాములోరి కల్యాణోత్సవం శాస్తయ్రుక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని, కల్యాణ మండపాన్ని విద్యుత్ దీపాకాంతులతో ముస్తాబు చేశారు. కల్యాణ వేదిక చుట్టు కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.

జానకిపురం ఎన్‌కౌంటర్ పోలీసు అమరులకు నివాళి
మోత్కూరు, ఏప్రిల్ 4: మండలంలోని జానకిపురం ఎన్‌కౌంటర్‌లో పోలీసు అమరవీరులైన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజుల చిత్రపటాలకు మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2015 ఏప్రిల్ 4న జానకిపురం గ్రామశివారులో సిమి ఉగ్రవాదులైన ఇద్దరిని హతమార్చి ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు అమరులైన సంఘటన నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పోలీసు అమరులను స్మరించుకున్నారు. ఈకార్యక్రమంలో మోత్కురు, అడ్డగూడురు ఎస్సైలు రవికుమార్, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ జానీ సిబ్బంది పాల్గొన్నారు.