నల్గొండ

చెర్లగూడం నిర్వాసితులకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, ఏప్రిల్ 4: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చెర్లగూడం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శివన్నగూడెం గ్రామంలో భూనిర్వాసితులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాల్వాయి మాట్లాడుతూ నిర్వాసితులకు అందించనున్న నష్ట పరిహారం ఏమాత్రం సరిపోదని ఎకరాకు కనీసం 15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో 123 జివో రద్దు కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనులను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. గత యుపిఎ ప్రభుత్వం దేశంలో నిర్మించబోయే అన్ని ప్రాజెక్టులకు పరిహారం ఇచ్చేందుకు 2013 భూసేకరణ చట్టం కింద జీవోను తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం సబబు కాదన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించడం బాధకరమని, న్యాయం చేయాల్సిన వ్యక్తే పనులను ముందు వరసలో నిలబడి ప్రోత్సహించడం దేనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ డిండి ఎత్తిపోథల పథకం పైలాన్ ఆవిష్కరణ సమయంలో చేసిన హామీలను తూ.చ తప్పకుండా నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. భూములు కోల్పోయి సగం బాధపడుతున్న రైతులను పోలీసులతో భయబ్రాంతులకు గురిచేసి మిగతా సగం చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించే వరకు పనులను తక్షణమే నిలపుదలచేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం అఖిలపక్షంతో కలిసి స్థానిక తహశీల్దార్ వేంకటేశంకు భూ నిర్వాసితుల డిమాండ్లకు సంబంధించిన వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మునుగోడు ఇన్‌చార్జి పాల్వాయి శ్రవంతి రెడ్డి, జడ్పీటిసి మేదరి యాదయ్య, ఎంపిపి అనంతరాజు గౌడ్, సింగిల్‌విండో చైర్మన్, మద్ది విఠల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు టి విజయరామరావు, మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు పాముల యాదయ్య, కంచుకట్ల వసంతలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

జీవన్‌దాన్‌కు వెలిమినేడు యువకుడి అవయవాలు
* చనిపోయి ఇతరులకు ప్రాణాలు పోస్తున్న యువకుడు

చిట్యాల, ఏప్రిల్ 4: మృతిచెందిన వెలిమినేడు పంచాయతీ పరిధిలోని సుర్కంటిగూడెంకు చెందిన ముడుపు నవీన్‌రెడ్డి అవయవాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్‌దాన్‌కు దానం చేశారు. మండలంలోని వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెలిమినేడు పంచాయతీ పరిధిలోని సుర్కంటిగూడెంకు చెందిన ముడుపు నవీన్‌రెడ్డి (18) మృతిచెందాడు. నవీన్‌రెడ్డి మృతిచెందడంతో మృతుని అవయవాలను జీవన్‌దాన్‌కు దానం చేశారు. నవీన్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి వెలిమినేడు శివారులోని గ్రామశివారులోని శ్రీఆంజనేస్వామి దేవస్థానం నుండి నివాసానికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం వెనుకనుండి ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన నవీనరెడ్డిని అంబులెన్స్‌లో హయత్‌నగర్‌లోని సన్‌రైస్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడు నవీన్ అవయవాలను ఇతరులకు అమర్చేందుకుగాను కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్‌దాన్‌కు దానం చేశారు. నవీన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతిచెందిన నవీన్‌రెడ్డి తాను చనిపోయి ఇతరులను పోసేందుకు తన అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. తాను చనిపోయినా నవీన్‌రెడ్డి అవయవాలు జీవన్‌దాన్ ద్వారా ప్రాణం పోయనున్నాయి. ఈమేరకు ప్రమాదానికి సంబంధించిన ఘటనపై చిట్యాల ఎస్‌ఐ సూదిని దేవేందర్‌రెడ్డి (క్రైం) కేసు నమోదు చేసుకుని దర్యాపు జరుపుతున్నట్లు తెలిపారు.