నల్గొండ

అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వేగంగా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 13: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. గురువారం కలెక్టర్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జిల్లా విజిలెన్స్ ఆండ్ మానిటరింగ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టం మేరకు బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు ఎప్పటికప్పుడు జరుగుతుందన్నారు. డివిజన్ల వారిగా కమిటీ సమావేశాలు నిర్వహించడంతో పాటు గ్రామసభల్లో అట్రాసిటి కేసులపై అవగాహాన కల్పిస్తామన్నారు. ప్రజల్లో అట్రాసిటీ కేసులపై ప్రచారం చేపడుతామన్నారు. స్థానిక పోలీస్ అధికారులు అట్రాసిటి కేసుల విచారణ సక్రమంగా సాగించాలన్నారు. ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించే దిశగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అట్రాసిటీ కేసుల విచారణలో చురుగ్గా వ్యవహరిస్తుందన్నారు. కమిటీ సభ్యులు బొర్ర సుధాకర్, రేఖల భద్రాద్రి, ప్రవీణ్‌నాయక్, అంగోతు ఫకీరా, హఫీజ్‌ఖాన్, ఎస్.ప్రభావతి, చక్రహరి రామరాజు, నాంపల్లి నరసింహాలు మాట్లాడుతు జిల్లాలో అట్రాసిటీ బాధితుల వివరాలు వెల్లడించి బాధితులను ఆదుకోవాలని కోరారు. అట్రాసిటీ కేసుల తీవ్రతను ప్రజల్లో విస్తృత ప్రచారం సాగించినట్లయితే దళితులపై దాడులు తగ్గుతాయన్నారు. కొన్ని చోట్ల ఇతర కేసులను అట్రాసిటీ కేసులుగా నమోదు చేస్తుండటం చట్టానికి నష్టదాయకంగా ఉంటుందన్నారు. ఈసమావేశంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, డిడిడబ్ల్యువో నరోత్తంరెడ్డి, డిఆర్‌డివో అంజయ్య, ఆర్డీవోలు వెంకటాచారి, లింగ్యానాయక్, కిషన్‌రావు, ఐసిడిఎస్ పిడి పుష్పలత, డిఎస్పీలు సుధాకర్, రాంగోపాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

గ్రంథాలయ అభివృద్ధిలో భాగస్వాములవాలి
- కంప్యూటర్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
కోదాడ, ఏప్రిల్ 13: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని, తమకు చేతనైనమేరకు చేయూతను అందించాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి కోరారు. కోదాడ బాపూజీ గ్రంథాలయానికి సాగర్ లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి విరాళంగా అందించిన లక్ష రూపాయల విలువైన రెండు కంప్యూటర్‌లను గురువారం గ్రంధాలయంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభించారు. 15 వేల రూపాయల వ్యయంతో లోకహిత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విఠల్ ఏర్పాటు చేసిన మంచినీటి పైప్‌లైన్, నల్లా కలెక్షన్‌ను పద్మావతిరెడ్డి ప్రారంభించి దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరు పఠనాసక్తిని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన గ్రంథాల, పత్రికల పఠనంతోనే సాధ్యమన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హమీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కట్టెబోయిన శ్రీనివాసయాదవ్, లెఫ్ట్‌కెనాల్ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, రీడర్స్ ఫోరం అధ్యక్షుడు బెలిదె అశోక్‌కుమార్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్, టిఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ పార సీతయ్య, కౌన్సిలర్లు కొమరగిరి రంగారావు, వాడపల్లి వెంకటేశ్వర్లు, పాశం శ్రీనివాస్, సైదానాయక్, పాలూరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్యబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటిరెడ్డి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బాబు, గ్రంథాలయాధికారి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.