నల్గొండ

ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 13: రబీ సీజన్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో సమస్యలు లేకుండా కొనుగోలుకు చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ రెండవ స్థాయా గ్రామీణాభివృద్ది సంఘం సమావేశంలో జడ్పీటీసిలు అధికారులను డిమాండ్ చేశారు. గురువారం జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసిలు తండు సైదులుగౌడ్ మాట్లాడుతు ఇప్పటికే గ్రామాల్లో ఐకెపి కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వస్తుందని కొనుగోలులో జాప్యంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. చైర్మన్ ఎన్. బాలునాయక్ స్పందిస్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిచి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బిందు, తుంపర సేద్య పరికరాలను విరివిగా మంజూరు చేయాలని, పట్టు, ఉద్యానవన పరిశ్రమలను ప్రొత్సహించాలని సభ్యులు కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి గ్రామాల్లో వేసవిలో వలసల నివారణకు పనుల సంఖ్యను పెంచాలని కోరారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులను లబ్ధిదారులకు వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, పెండింగ్ ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు జరుపాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌డివో కిరణ్‌కుమార్, పరిశ్రమల శాఖాధికారి బాబురావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో వౌలిక వసతులు విస్తరించాలి
విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించాలని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ అధికారులకు సూచించారు. గురువారం మధ్యాహ్నం జరిగిన నాల్గవ స్థాయా సంఘం విద్యవైద్యశాఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, హాస్టల్, మధ్యాహ్న భోజన వసతి, ఉపకార వేతనాల వసతులపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి అడ్మిషన్ల సంఖ్య పెంచి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. వేసవిలో పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతులు, అదనపు తరగతి గదుల పనులను పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యశాఖ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్వాహణను మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి మహిళలకు ఆర్థిక సహాయం, కెసిఆర్ కిట్‌లు అందిస్తామని చెబుతున్నందునా ప్రభుత్వ ఆసుపత్రులకు పెరుగుతున్న రద్దీ మేరకు వసతులు కల్పించాలన్నారు. జడ్పీటీసిలు మాట్లాడుతు తమ మండలాల్లోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల సమస్యలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో స్థాయా సంఘం సభ్యులు, విద్య, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు. .