నల్గొండ

ధాన్యానికి గరిష్ట మద్దతు ధర చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 20: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం గరిష్ట మద్దతు ధర కల్పించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి గంజ్ మార్కెట్ యార్డును ఆయన సందర్శించారు. ధాన్యం విక్రయించడంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పంట పొలాల వద్ద అనేక సమస్యలు ఎదుర్కొని పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వర్షం తీవ్రంగా నష్టం కల్గించగా మిగిలిన పంటను మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుందామన్న రైతును దళారులు, కమీషన్ ఏజెంట్‌లు నిలువు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 120 ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 69 కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు ధాన్యం అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే ఐకెపి కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు గరిష్ట మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రవాణ చేపట్టి ఇతర రైతులకు అవకాశం కల్పించాలని అదే విధంగా ధాన్యానికి సరిపోను గన్నీ బ్యాగులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అవాజ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి జాహంగీర్, నాయకులు నర్సింహులు, బాల్‌రాజు, మల్లేష్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, పాండు, కృష్ణ, అనురాధ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు మార్కెట్‌కు ధాన్యం తీసుకురావొద్దు
చిట్యాల, ఏప్రిల్ 20: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు పెరిగినందున ఈనెల 21, 22వ తేదీల్లో మార్కెట్‌కు సెలవులు ప్రకటించనైనదని రైతులు ధాన్యాన్ని తీసుకురావద్దని మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు గోదుమగడ్డ పద్మరెడ్డి తెలిపారు. మార్కెట్డ్‌లో పిఏసిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ళలో రైతులు మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకువచ్చి ఆరబోశారని, మరికొంతమంది రైతుల ధాన్యం తూకం జరగలేదన్నారు. యార్డులో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, ధాన్యం నిల్వలు కొనుగోళ్ళు పూర్తయ్యాక 24 నుండి కొనుగోళ్ళు యధావిధిగా జరుగుతాయన్నారు. రైతులు 21, 22వ తేదీల్లో మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకురాకుండా సహకరించాలని కోరారు.