నల్గొండ

మరో 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 20: ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో ధాన్యం దిగుమతులు అధికంగా ఉన్నందున మరో మూడురోజుల్లో అధనంగా 50్ధన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ వెల్లడించారు. గురువారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం జరగేందుకు గల కారణాలు, జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరుతెన్నులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఐకేపి, సింగిల్‌విండోల ద్వారా ఏర్పాటుచేసిన కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి 48గంటల్లో నగదు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొనుగోళ్లు ప్రారంభించినప్పటికి వరకు ఇప్పటి వరకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు. సాంకేతిక లోపాలను పరిష్కరించేందుకు నిపుణులను సంప్రదించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. తమ అంచనాలకు మించి ధాన్యం వస్తున్నందున రైతులు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు మరో 50్ధన్యం కొనుగోలు కేంద్రాలను మూడురోజుల్లోనే ప్రారంభించేలా ఆదేశాలు జారిచేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు వివరించారు. గ్రామాల్లో సరైన ప్రచారం లేకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా సూర్యాపేట మార్కెట్‌కు కూడా రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొస్తున్నారన్నారు. అందువల్ల సోమవారం మార్కెట్‌కు 90వేల బస్తాల ధాన్యం రావడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మార్కెట్‌లో రోజుకు 40వేల బస్తాల వరకు ధాన్యం తెస్తే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సజావుగా కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల శుక్రవారం నుండి మార్కెట్‌లో టోకెన్ విధానాన్ని అమలుచేసి రోజుకు 40వేల బస్తాల వరకు కొనుగోళ్లు జరుపుతామని స్పష్టంచేశారు. కొనుగోళ్ల ద్వారా రైతులు ఇబ్బందులకు గురికాకుండా వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు మిల్లర్లతో చర్చించి ఎప్పటికప్పుడు ధాన్యం ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆర్ ఎన్ ఆర్ రకం సన్నధాన్యాన్ని కొనుగోళ్లు చేసేందుకు కేంద్రాల్లో అనుమతి లేన్నందున ఈ రకం ధాన్యం పండించిన రైతులు సూర్యాపేట మార్కెట్ ధాన్యాన్ని తీసుకొస్తున్నారని, ఈ ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నందున మద్దతు ధర రావడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని కూడా అనుమతించాలని కోరుతూ పౌరసరఫరా శాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు నాలుగు వైపుల గేట్లు ఉన్నప్పటికి ప్రస్తుతం ప్రధాన గేటు ఒక్కటే వినియోగిస్తున్నామని మిగిలిన మూడు గేట్లను తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ మిగిలిన గేట్లను తెరిపిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్‌వో అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ రాంపతి, జిల్లా సహకార అధికారి లక్ష్మినారాయణ, మార్కెట్ కార్యదర్శి ఇ. వెంకటేశం తదితరులు ఉన్నారు.

కూలిగా మారిన ఎంపి గుత్తా, ఎమ్మెల్యే రవీంద్ర
* 2.50 లక్షల ఆర్జన

దేవరకొండ, ఏప్రిల్ 20: ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు వెళ్ళేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలీ పనులు చేసి డబ్బులు సంపాదించుకోవాలని సిఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గురువారం దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లో కంకరమిల్లు, రైస్‌మిల్లుల్లో కూలీ పనులు చేసి రూ.2.50 లక్షల కూలీని సంపాదించారు. దేవరకొండ - కొండమల్లేపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కంకరమిల్లులో ఎంపి గుత్తా, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు ఎర్రటి ఎండలో మిల్లులోని కంకర కుప్పలను ఎత్తి ట్రాక్టర్‌లోకి పోశారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని రామకృష్ణ ఆయిల్ మిల్లులో బస్తాలను లారీ నుండి బస్తాలను కిందికి దించారు. దీంతో ఈ రెండు మిల్లుల నుండి రూ.2.50 లక్షల కూలీని సంపాదించారు. ఈ సందర్భంగా ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలువురు స్వచ్ఛందంగా డబ్బులను ఇస్తున్నారన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాలకు దేవరకొండ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటిసి ఆలంపల్లి నర్సింహ, నాయకులు కేసాని లింగారెడ్డి, రమావత్ దస్రూనాయక్, శిరందాసు కృష్ణయ్య, రాజినేని వెంకటేశ్వర్‌రావు, టివిఎన్ రెడ్డి, వస్కుల కాశయ్య, దేవేందర్, అక్రమ్, సంజీవరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

మత రిజర్వేషన్లను అడ్డుకుంటాం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 20: రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించేవిధంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసిన మత రిజర్వేషన్లను జాతీయ స్థాయిలో న్యాయపరంగా బిజెపి అడ్డుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ఉన్నదని మతపర రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించడం సిగ్గుచేటన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, మరో వైపు మతపరమైన రిజర్వేషన్ల ద్వారా కలిగే ఇబ్బందులను, టిఆర్‌ఎస్ వ్యవహరాన్ని కేంద్రం, రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్లి అడ్డుకుంటామన్నారు. కెసిఆర్ కపట ప్రేమను ముస్లింలు అర్థం చేసుకోవాలన్నారు. నల్లగొండ మండలాధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్ రెడ్డి, నాయకులు ఓరుగంటి రాములు, పోతెపాక సాంబయ్య, బాకి పాపయ్య, బైరగోని రాజయ్య, గుండెబోయిన మల్లయ్య, పెరిక మునికుమార్, భూపాల్‌రెడ్డి, పోతెపాక లింగస్వామి తదితరులున్నారు.