నల్గొండ

వచ్చే ఎన్నికల్లో బిజెపిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 21: రానున్న 2019 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన కొనసాగిస్తూ దేశాన్ని అభివృద్ధ్ది పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు. మోదీ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా వెనకబడిన వర్గాల ప్రజలకు చేయూతనిస్తున్నాయని చెప్పారు. దేశంలో నల్లధనాన్ని నిర్మూలించే లక్ష్యంతో సాహసోపేతంగా పెద్దనోట్లను రద్దుచేశారని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరుల వివరాలు బహిర్గతం అవుతున్నాయన్నారు. తెలంగాణ వాదం పేరుతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, కెజి టూ పిజి ఉచిత విద్యా విధానం వంటి హామీలు కార్యరూపం దాల్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తూ తామే చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుటుందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా రైతాంగం పండించిన వరి, మిర్చి, కంది పంటలకు కనీస మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వంపై రైతుల్లో అసంతృప్తి పెరిగిపోయందని ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయంతో రైతులకు ఉచిత ఎరువులు అంటూ కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. అతే కాకుండా టిఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందంటూ బూటకపు సర్వేలతో ప్రజలకు మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించడం లేదన్నారు. నిధులు ఇవ్వకుండానే కేంద్ర ఇచ్చిన నిధులను తామే ఇచ్చినట్లుగా చెబుతూ ప్రజలకు మభ్యపెడుతున్నారన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు నూనె సులోచన, కనగాల వెంకటరామయ్య, బొబ్బా భాగ్యరెడ్డి, చెరుపల్లి సైదయ్య, నరినాయక్, నాయకులు బండపల్లి పాండురంగాచారి, చల్లమల్ల నర్సింహ్మా, జీడి భిక్షం, నల్లకుంట్ల అయోధ్య, అబీద్, రామగిరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ దళిత వ్యతిరేక ప్రభుత్వం
ఎస్సీల రిజర్వేషన్లు ఎందుకు పెంచరు?
* పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచకపోవడం దారుణమని తెలంగాణ మాల మహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ చట్టాల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీ జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునే హాక్కును కల్పించినా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం మతపరమైన రిజర్వేషన్లను పెట్టడం వల్ల ఆయా కులాలకు సంబంధించిన రిజర్వేషన్లను, ముస్లింలకు అమలవుతున్న 4శాతం రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. ఎస్సీలు 16.3 శాతం ఉంటే 15 శాతం, ఎస్టీలు 9.6 శాతం ఉండగా 10 శాతం, బిసిలకు 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ దళిత వ్యతిరేక ప్రభుత్వమని, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఏర్పాటు చేయకపోవడం, బడ్జెట్‌లో కేటాయించిన నిధుల దారిమళ్లింపు చేయడం సిగ్గుచేటన్నారు. 93 శాతం బడుగులు ఉన్న ఈ రాష్ట్రంలో బడుగులకు అన్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులకు తొత్తులుగా మారి ప్రాజెక్టులకు వేల కోట్ల నిధులు కేటాయించి కమీషన్లు దండుకుంటున్నారన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన కోదండరాం తదితర ఉద్యమ కారులను కెసిఆర్ అణిచి వేస్తూ నిరంకుశపాలన చేస్తున్నారన్నారు. రాజధానిలో ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం దారుణమని తెలిపారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థులకు చెల్లించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో నాయకులు సృజన్‌కుమార్, సంజీవ, గోలి సైదులు, సాయిగిరి, సతీష్, శివక్రిష్ణ, కట్ట సైదులు తదితరులు ఉన్నారు.