నల్గొండ

సహకార సంఘాలు రైతుల నేస్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, ఏప్రిల్ 28: సహకార సంఘాలు రైతుల నేస్తాలుగా పనిచేస్తు వారి సంక్షేమానికి సేవలందిస్తున్నాయని డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగరావు అన్నారు. శుక్రవారం ఆయన రైతులకు ట్రాక్టర్ల రుణపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకుల దీటుగా రైతు సంక్షేమమే ధ్యేయంగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయన్నారు. కోటి 15లక్షలతో ట్రాక్టర్లు, హర్వేస్టర్లు జిల్లాలో మంజూరైనట్లుగా తెలిపారు. ఆర్‌బిఐ, నాబార్డు గైడ్‌లైన్స్ మేరకు వాణిజ్య బ్యాంకులు 18శాతం వ్యవసాయ రుణాలు అందించాల్సివుండగా కనీసం 10శాతం కూడా అందించడం లేదన్నారు. రైతులు తమ పాసుపుస్తకాల ద్వారా సహకార సంఘాల్లో వందశాతం రుణాలు పొందవచ్చన్నారు. సిఎం కెసిఆర్ ఏటా రైతుకు ఎరువుల కోసం ఎనిమిది వేల రూపాయలు అందిస్తామనడం రైతులకు మేలు చేస్తుందన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి సిఈవో మదన్‌మోహన్, డిజిఎం గురవానాయక్, డైరక్టర్లు పి.నరేందర్‌రెడ్డి, ఎం.రంగారెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కె.రామకృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, మార్కట్ చైర్మన్ మహేంద్రనాథ్, మేనేజర్ నెహ్రుజ్యోతి, ఎంపిటిసి శ్రీను, యాకుబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

7 నుండి స్వామి వారి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 28: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహస్వామి దేవస్దానం శ్రీ స్వామి వారి జయంతి ఉత్సవాలు మే నెల 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత తెలిపారు. శుక్రవారం కొండపైన దేవస్థానం కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 7న ఆదివారం మొదటి రోజు ఉదయం 8.30 గంటలకు స్వస్తివాచనము, విష్వక్షేణపూజ, పుణ్యాహవచనము, లక్షకుంకుమార్చన, 8న సోమవారం ఉదయం 10.00 గంటలకు లక్షపుష్పార్చన ఉంటుందన్నారు. 9న మంగళవారం ఉదయం 9.00 గంటలకు నిర్వహించే సహస్ర కళషాభిషేకంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. ఈ పూజల్లో పాల్గొనే దంపతులు 1,116 చెల్లించి టికెట్ ఖరీధు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పూజల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో ఏఈఓ ఆకునూరి చంద్రశేఖర్, ఈఈ దయాకర్ రెడ్డి, డిఈ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.