నల్గొండ

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 28: నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ శుక్రవారం జిల్లా పరిధిలోని నల్లగొండ, శాలిగౌరారం, నకిరేకల్, అడ్లూరు, అయిటిపాముల వ్యవసాయ మార్కెట్‌లను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు సాగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను, కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్ తదుపరి వరసుగా ఆయా ప్రాంతాల్లోని మార్కెట్‌లకు వెళ్లారు. నకిరేకల్ మార్కెట్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ధాన్యం కొనుగోలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు కాంటా వేసి వెంటనే మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లారీల కాంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు లారీలను పంపించాల్సిందిగా కోరాలని సూచించారు. స్థానిక లారీలను, డిసిఎంలను మాట్లాడైనా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలను. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకవచ్చిన రైతులను ఇబ్బంది పెట్టవద్ధన్నారు. సీరియల్ పద్దతి మేరకు ముందుగా వచ్చిన వారి ధాన్యం కొనుగోలు చేసి పంపించాలన్నారు. ఎక్కడైనా కాంటాలు అవసరమైతే వెంటనే ఏర్పాటు చేయాలని తహశీల్ధార్లను ఆదేశించారు. అంతకముందు నల్లగొండ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో, గ్రామీణాభివృద్ధి కార్యాలయాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు డేటా ఏంట్రీని ఆయన పరిశీలించారు. సాప్ట్‌వేర్ సమస్యలను అధిగమించి డేటా ఏంట్రీని వేగంగా జరిపించి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. డేటా ఏంట్రి ఆపరేటర్లకు ఒకరోజు శిక్షణ అందించి డేటా ఏంట్రి వేగవంతంగా సాగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, డిఆర్‌డివో ఆర్.అంజయ్య, డిఎం రాజేందర్, డిఎస్‌వో ఉదయకుమార్, ఏడి అలిమ్ తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు డిండి కాలువ పనుల అడ్డగింత
మర్రిగూడ, ఏప్రిల్ 28: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ నుండి మండలంలోని తూర్పుతండాగూడెం మీదుగా చర్లగూడెం రిజర్వాయర్‌ను కలిపే డిండి కాలువ నిర్మాణ పనులను రెండో రోజు శుక్రవారం కూడా ఎంపిపి అనంతరాజు గౌడ్ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు అడ్డుకున్నారు. అనంతరం నిర్వాసిత రైతులకు తండాల సమావేశమైన ఎంపిపి మాట్లాడుతూ కాలువ నిర్మాణంలో భూమి కోల్పోతున్న ప్రతిరైతుకు కాంట్రాక్టర్ కొంతమంది దళారుల ద్వారా నకిలీ అగ్రిమెంట్లను చేసుకున్నారన్నారు. నిరక్షరాస్యులైన గిరిజన రైతులను మోసం చేసి ప్రభుత్వం నుండి వచ్చే పరిహారం రాకముందే కాలువ పనులను కొనసాగించేందుకు మోసాలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. పరిహారంపై కాంట్రాక్టర్ స్పష్టమైన వైఖరి తేల్చకుండానే పనులు కొనసాగిస్తు రైతుల నోట్లో మట్టికొట్టడటం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించేదాకా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టరాయనిపల్లి ఎంపిటిసి బాడిగ యాదయ్య, నిర్వాసిత గిరిజన రైతులు పాల్గొన్నారు.