నల్గొండ

ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 28: రైతులు పండించిన వరి ధాన్యానికి గరిష్ట మద్ధతు ధర చెల్లించి వేగంగా కొనుగోలు చేపట్టాలని, మార్కెట్ యార్డులలో రైతులకు వౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి మార్కెట్ యార్డులో వరికుప్పలు పరిశీలించిన కోదండరాం రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ యూనిట్‌గా ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రైతులు యాసంగి పంట పండించేందుకు ప్రైవేటు రుణాలపై ఆధారపడాల్సి వచ్చిందని ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వ రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు నీళ్ళు లేక వడగండ్ల వానకు సగం పంట నష్టపోయారని మిగిలిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుల్లోకి వస్తే సరియైన గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మార్కెట్ యార్డులలో పర్యటిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. జూన్ మాసంలో వ్యవసాయం, రాజకీయాలపై ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లుగా కోదండరాం తెలియజేశారు. ఈ పర్యటనలలో ఆయన వెంట జెఎసి నాయకులు అచ్యుత రామారావు, ధర్మార్జున్, జి. వెంకటదాసు, మధు, సత్యంగౌడ్ తదితరులున్నారు.