నల్గొండ

పోరుకు తెరలేచింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భుజం భుజం కలిపి పోరాడిన టి.జెఎసి శ్రేణులు, టిఆర్‌ఎస్ శ్రేణులు స్వరాష్ట్రంలో మాత్రం వైరి వర్గాలుగా మారి తలపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ దిగ్గజాలు సీఎం కెసిఆర్ ప్రభుత్వానికి, పొలిటికల్ జెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్‌కు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్షంగా యుద్ధంగా మారుతుంది. ప్రభుత్వాన్ని తరుచు తన విమర్శలతో ఇరుకున పెడుతున్న కోదండరాం పట్ల ఇప్పటికే సీఎం కెసిఆర్ ప్రభుత్వం హైద్రాబాద్‌లో నిరుద్యోగ ర్యాలీ నిర్వాహణ భగ్నంతో తన అణిచివేత వైఖరిని చాటింది. అనంతరం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి టి.జెఎసి సత్తా చూపాలన్న కసితో ఉన్న కోదండరాంకు రైతాంగం సమస్యలు అస్రశస్త్రాలుగా అందివచ్చాయి. ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యల పోరాటం పిదప కంది, మిర్చి, ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించేందుకు కోదండరామ్ మార్కెట్‌ల సందర్శన యాత్రతో ప్రభుత్వంపై మరో పోరుకు దిగారు. అయితే ఈ దఫా కోదండరామ్ యాత్ర కాస్తా టి.జెఎసి, టిఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య ప్రత్యక్ష యుద్ధానికి వేదికైంది. శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూర్, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లను సందర్శించి ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన కోదండరాంను స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుని గోబ్యాక్ అంటు నినాదాలు చేశారు. కెసిఆర్ రైతు పక్షపాతిగా రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని రైతు సమస్యలతో రాజకీయం వద్ధంటు కోదండరాంతో వాగ్వివాదానికి దిగారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు వస్తే అడ్డుకోవడం ప్రభుత్వ పిరికి చర్యకు, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమంటు టి.జెఎసి వర్గాలు ప్రతివాదానకు దిగాయి. మోత్కూర్, సూర్యాపేటలో రెండు వర్గాలు తోపులాటకు దిగగా పోలీసులు ఇరువర్గాలను అదుపు చేసి కోదండరాంను సురక్షితంగా అక్కడి నుండి పంపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అనేక నిర్భంధాలు దాడులను చవిచూసినా తాను ఈ దౌర్జన్యాలకు బెదిరేది లేదంటు ఖమ్మం, నకిరేకల్ మార్కెట్‌లలో తన సందర్శన కొనసాగుతుందంటు కోదండరామ్ స్పష్టం చేశారు.
ఇక పోరు ఉదృతమే..!
కోదండరామ్ త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటిస్తారన్న వార్తల నేపధ్యంతో పాటు దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీలకు ముందస్తుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్న వార్తల నేపధ్యంలో అటు టి.జెఎసి శ్రేణులు, ఇటు టిఆర్‌ఎస్ శ్రేణులు రెండు కూడా పరస్పరం రాజకీయ పోరును ముమ్మరం చేస్తున్నాయని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి. పార్టీ ఏర్పాటుకు ముందు తెలంగాణ వ్యాప్తంగా మరింత ప్రజాదరణ సాధనకు కోదండరామ్ మార్కెట్‌ల యాత్రతో ప్రయత్నిస్తున్నట్లుగా టిఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోదండరామ్ బృందంపై ఆదిలోనే రాజకీయంగా ఆధిపత్యంపై చాటేందుకు టిఆర్‌ఎస్ సైతం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే మోత్కూర్, సూర్యాపేటలలో కోదండరాం కార్యక్రమాలను టిఆర్‌ఎస్ వర్గాలు ముఖాముఖిగా అడ్డుకున్నాయని భావిస్తున్నారు. నేడు ఖమ్మం జిల్లా మార్కెట్‌లకు సందర్శనకు కోదండరామ్ వెళ్తున్న క్రమంలో ఇప్పటికే అక్కడ శుక్రవారం మిర్చి మార్కెట్‌లో చెలరేగిన రైతుల ఆందోళన నేపధ్యంలో పోలీసులు ఆయన పర్యటనను అనుమతిస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. అటు ఇటీవల సిఎం కెసిఆర్ రైతాంగాన్ని ఆకర్షించేందుకు వచ్చే బడ్జెట్ నుండి రైతులకు సాగు పెట్టుబడికి ఎకరాకు ఏటా ఎనిమిదివేల రూపాయలు ఇస్తామన్న ప్రకటించారు. అయితే ఈ ప్రకటన క్షేత్ర స్థాయిలో కంది, మిర్చి, ధాన్యం, నిమ్మ వంటి పంటలను అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్న రైతాంగంలో నెలకొన్న అసంతృప్తిని ప్రస్తుతానికి తగ్గించలేకపోతుంది. అదిగాక కెసిఆర్ రైతుల్లో తమ ప్రభుత్వం పట్ల ఏర్పడిన అసంతృప్తిని తగ్గించేందుకే రైతులకు ఏటా ఎనిమిది వేలు అందించే పథకాన్ని ప్రకటించాడని టి.జెఎసి సహా విపక్షాలు విశే్లషిస్తున్నాయి. అందుకే ప్రభుత్వానికి దెబ్బతీసేందుకు రైతాంగం, విద్యార్థి వర్గాల నుండే తమ ప్రయత్నాలు ఉద్ధృతం చేయాలని టి.జెఎసి, ఇతర విపక్షాలు తలపోస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏకత్రాటిపై పోరాడిన టి.జెఎసి, టిఆర్‌ఎస్‌లు వైరి వర్గాలుగా ఢీ అంటే ఢీ అంటు తలపడుతున్న పరిణామాలు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఆసక్తి గమనిస్తుండగా తెలంగాణ రాజకీయాలు మునుముందు మరెన్ని మలుపులు తీసుకోనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

బీబీనగర్ రంగాపురంలోనే ఎయిమ్స్
* నిమ్స్‌లో త్వరలోనే 100 పడకలతో ఇన్ పేషంట్
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
భువనగిరి, ఏప్రిల్ 28: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం గ్రామంలోని నిమ్స్ హాస్పిటల్ పక్కనే 200 ఎకరాలలో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని ఆసుపత్రులలో ఆధునీక వైద్య పరికరాలతో పాటు రోగులకు వౌళిక వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తామని తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిమ్స్ ఆసుపత్రితో పాటు భువనగిరి ఏరియా ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పాలనలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రుల వైద్య సేవలు మరిచి ఆర్థిక భారంతోకూడిన ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినట్లుగా ఆయన తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే 100 పడకలతో ఇన్ పేషేంట్ విభాగాన్ని ప్రారంభించి రోగులకు అత్యంత ఆధునిక వైద్య సేవలందింస్తామని తెలిపారు. అందుకుగాను భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు నాగార్జున కంపెనీ ప్రతినిధులతో పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిమ్స్ హాస్పటల్ ఏర్పాటు చేసేందుకు 200 ఎకరాల భూసేకరణ జరిపి ప్రతిపాదనలు తెలిపారు. కేంద్ర బృందం పరిశీలించికపోవడంతో ఎయిమ్స్ ఏర్పాటు జాప్యానికి కారణమన్నారు. అదే విధంగా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఐసియూ, ట్రౌమా విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20శాతం రోగుల సంఖ్య పెరగడమే కాకుండా ప్రసవాల సంఖ్య రెండింతలైందన్నారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించి ప్రభుత్వం అందిస్తున్న రూ.12వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా అందిస్తున్న కిట్‌ను తల్లిపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య ఉన్నారు.