నల్గొండ

జాజిరెడ్డిగూడెం నుండి... కేంద్ర జలసంఘం చీఫ్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, ఏప్రిల్ 29: తెలంగాణ ఉద్యమ కెరటం కెసిఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సమకాలికుడైన కేంద్ర జలవనరుల సంఘం మాజీ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు రామరాజు విద్యాసాగర్‌రావు (77) మృతితో ఆయన స్వగ్రామమైన జాజిరెడ్డిగూడెంలో విషాధచాయలు అలుముకున్నాయి. సూర్యాపేట జిల్లా పరిధిలోని జాజిరెడ్డిగూడెంలో రామరాజు రాఘవరావు-లక్ష్మమ్మ దంపతులకు రెండవ సంతానంగా నవంబర్ 14, 1939లో సామాన్య రైతు కుటుంబంలో విద్యాసాగర్‌రావు జన్మించారు. గ్రామస్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పుట్టిన గడ్డకు వనె్న తెచ్చారు. 10వ తరగతి వరకు జాజిరెడ్డిగూడెంలో, ఇంటర్ విద్యను సూర్యాపేటలో అభ్యసించారు. ఆ తర్వాత ఉస్మానియాలో చేరి ఇంజనీరింగ్‌లో పట్ట్భద్రులయ్యారు. అనంతరం జూనియర్ ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఉద్యోగిగా పనిచేస్తూనే ఢిల్లీ యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పూర్తిచేసి న్యాయశాస్త్రంలోనూ పట్టాపొందారు. ఈ క్రమంలోనే అమెరికాలోని కొలారాడ్ స్టేట్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిప్లొమా పొంది ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి ముఖ్య సలహాదారునిగా కూడా వ్యవహరించారు. జలసంఘం చీఫ్ ఇంజనీర్‌గా వివిధ సెమినార్‌లో శిక్షణలు ఇస్తూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, థాయిలాండ్, మలేషియా, కెన్యా దేశాల్లో ఆయన సేవలను అందించారు. 1997లో కేంద్ర జలవనరుల శాఖ నుండి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. జలవనరులపై ఆంధ్రా దోపిడీ వ్యవస్థ తెలంగాణను దక్కాల్సిన సాగునీటిని ఏవిధంగా దోచుకుంటున్నారో చాటిచెప్పారు. తెలంగాణ ఉద్యమ సభలో కెసిఆర్‌తో పాటు ప్రతి ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ప్రజలను చైతన్యం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను లెక్కలతో సహా ప్రజలకు తెలియజెప్పి ఉత్తేజితం చేశారు. తెలంగాణ ఉద్యమం, ఉద్యోగంతో పాటు విద్యాసాగర్‌రావు కవి, గాయకునిగా కూడ పలు రచనలు చేశారు. నీళ్లు-నిజాల పేరుతో విడుదల చేసిన సంకలనం తెలంగాణ ప్రజలకు జరుగుతున్న సాగునీటి అన్యాయాలను కళ్లముందుంచింది. ఉద్యమ సమయంలో తీసిన జై బోలో తెలంగాణ చిత్రంలోనూ విద్యాసాగర్‌రావు ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నప్పటికీ స్వగ్రామం, మండలం అన్నా అమితమైన ప్రేమ కనబర్చేవారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన శ్రీయోగనంద లక్ష్మినర్సింహస్వామి ఆలయానికి రూ.2.30 కోట్లతో పునర్ నిర్మాణానికి స్వయంగా చొరవ తీసుకొని ప్రణాళికలు రూపొందించారు. ఎన్ని రోజులైనా అర్వపల్లి దేవాలయానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తీసుకొస్తానని చెబుతుండేవారు. అదేవిధంగా స్వగ్రామంలో కల్యాణ మండపం నిర్మాణం కోసం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తన స్వగృహాన్ని విరాళంగా అందించి రూ.60 లక్షల సొంత ఖర్చుతో నిర్మించేందుకుగాను ఏడాది క్రితం మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డితో శంకుస్థాపన చేయించారు. అదేవిధంగా రూ.2 కోట్లతో జాజిరెడ్డిగూడెంలో సబ్ మార్కెట్‌యార్డు నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయించారు. రూ.3 కోట్లతో మూసీనది నుండి జాజిరెడ్డిగూడెం తీగల చెర్వుకు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. విద్యాసాగర్‌రావుకు భార్య సుజాత, కుమారుడు వెంకటరమణ, కుమార్తె అపర్ణ. కాగా అల్లుడు కొలనుపాక రాజేశ్వర్‌రావు ఢిల్లీలో ఐఎఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. కుమారుడు వెంకటరమణ వాటర్, అండ్ పవర్ కార్పొరేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం విద్యాసాగర్‌రావు తుదిశ్వాసను విడిచినట్లు తెలుసుకున్న గ్రామస్థులు, మండలవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. మండలానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కాగా, విద్యాసాగర్‌రావు మృతి పట్ల తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాసాగర్‌రావు మృతి పట్ల ఎంపిపి దావుల మనీషావీరప్రసాద్, జడ్పీటిసి సందా అమల, సర్పంచ్ పొన్న ప్రమీల సంతాపం వ్యక్తం చేశారు.

నేటి నుండి పానగల్ శ్రీ వెంకటేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలు

5న కల్యాణోత్సవం

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 29: పానగల్ చారిత్రాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి 7వ తేది వరకు ఘనంగా నిర్వహించనున్నట్లుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనే్నపర్తి సులోఛన, ప్రధానార్చకులు కందాల శ్రీనివాసాచార్యులు, మాజీ చైర్మన్ యాదగిరిలు తెలిపారు. నేడు 30వ తేది ఆదివారం ఆధ్యయనోత్సవాలు, 2న పరమవదోత్సవం, 3న బ్రహ్మోత్సవ అంకురార్పణ, 4న గరుడముద్ధ, విశ్వక్సేనారాధన, నిత్యం హోమం, బలిహరణం, భేరిపూజ, దేవతలకు ఎదుర్కోలు, 5న స్వామి వారి కల్యాణోత్సవం, 6న రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. పానగల్ రాజధానిగా పాలించిన కందూరు చోడవంశీయులు ఉదయన చోడ మహారాజు క్రీ.శ.1136 నుండి 1176వరకు సాగించిన పాలన కాలంలో ఉదయసముద్రం పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాల సమీపంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని ఉదయనఛోడుని వద్ద సీమ జమిందార్ దివాన్ కాంచనపల్లి లింగరాజు ఆధ్వర్వ్యంలో నిర్మితమైందన్నారు. ఆనాడు జైనులు గోకర్ణ క్షేత్రం నుండి ‘తిరువేగడత్తాను’ విగ్రహంతో పానగల్ మీదుగా వెలుతు రాత్రి బస చేశారు. తెల్లవారి ప్రయాణానికి ఎండ్లబండ్లు కదలకపోవడంతో చింతకు గురైన జైనులకు శ్రీవారు పెరుమాల్ ప్రయాణికుడి ఆవేశముఖంగా వచ్చి ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆలయం నిర్మితమైందన్నారు. అంతటి చారిత్రాక స్థల పురాణ ప్రశస్తి ఉన్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

పంటలకు మద్దతు ధర పెంచాలి
* డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్
తుర్కపల్లి, ఏప్రిల్ 29: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెంచాలని, వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2500 చెల్లించాలని డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధర అందక, కొనుగోలు చేసే దిక్కులేక ఆందోళనలు సాగిస్తున్నారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. మాయమాటలతో కాలం గడుపుతూ ఎన్నికల హామీలను ఒక్కడి కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. మూడేళ్ల ప్రగతి సభ అంటు వరంగల్‌లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్‌ను తిట్టడమే తప్ప కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పుకోలేక పోయారని దుయ్యబట్టారు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2లక్షల రుణమాఫీతో పాటు కౌలు రైతులకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బబ్బూరి రవింద్రనాథ్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, మార్కెట్ మాజీ డైరక్టర్ శంకర్‌నాయక్, ఎంపిటిసిలు బజ్జునాయక్, రాజయ్య, నాయకులు చంద్రయ్య, వెంకటేశం, భిక్షునాయక్, రాజు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.