నల్గొండ

ఇప్పటికే 1.6 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 29: నల్లగొండ జిల్లాలో ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.120 కోట్లతో 1.6 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ ఉప్పల్ గౌరవ్ వెల్లడించారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 80,000 హెక్టార్లలో వరి పండించారని, దిగుబడి కూడా బాగా ఉందనిన్నారు. ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి ఇప్పటి వరకు కేంద్రాల ద్వారా 1.6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. మరో 50 వేల టన్నుల మేర ధాన్యం కుప్పలు కేంద్రాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు ఇంకా 50 వేల టన్నుల మేర ధాన్యం వచ్చే అవకాశాలున్నట్టు తెలిపారు. ధాన్యం కొన్న వాటిలో 50 శాతం మిర్యాలగూడ డివిజన్ నుండే కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సుమారు 25 శాతం రూ.40 కోట్ల వరకు చెల్లించామని వివరించారు. సాఫ్ట్‌వేర్ మారిందని ఇక చకచకా చెల్లింపులు జరుగుతాయన్నారు.
15 రోజులుగా బస్తాల కోసం ఎదురు చూస్తున్నాం..
కలెక్టర్ ముందు రైతుల ఆవేదన
మిర్యాలగూడ మండలంలోని అవంతీపుర వ్యవసాయ మార్కెట్ యార్డులోని సహకార సంఘం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, బస్తాలు లేవని అంటున్నారని రైతులు ముత్తయ్య, సక్రునాయక్‌లు మార్కెట్‌యార్డును సందర్శించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అవంతీపురం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్‌కు హమాలీలు డబ్బాలకు డబ్బాల ధాన్యం తీసుకుంటున్నారని, అడిగితే కాంటాలు వేయడం లేదని రైతులు ఆరోపించారు. అదేవిధంగా కాంటాలు వేసేందుకు క్వింటాల్‌కు గాను రూ.45 అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ధాన్యం రికార్డు స్థాయిలో కొంటున్నామని, బస్తాలు రావడంలో జాప్యం జరుగుతున్నది వాస్తవమని, వెంటనే బస్తాలు తెప్పించి కాంటాలు వేస్తామన్నారు. అనంతరం ఆలగడపలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం సేకరించిన 3.2 ఎకరాల ఇళ్ల స్థలాన్ని పరిశీలించారు. కాల్వపల్లిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వెనువెంటనే ధాన్యం కొనేందుకు అదనంగా 2 కాంటాలు వేసి వాట్సాప్‌లో పంపాలని ఆదేశించారు. రైతుల ధాన్యం తడవకుండా చూడాలని కోరారు. ఆయన వెంట ఆర్డీఓ బి.కిషన్‌రావు, తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపిడిఓ ఎస్.వెంకట్‌రెడ్డి, డిటిలు రామకృష్ణారెడ్డి, లక్ష్మణ్, ఐకెపి కో-ఆర్డినేటర్ బెనర్జి, మార్కెట్ కార్యదర్శి జె.అనంతయ్య, పిఎసిఎస్ సిఇఓ లచ్చయ్యలు ఉన్నారు.